ETV Bharat / city

'మూతపడిన ప్లాంట్లు గుర్తిస్తున్నాం.. ఆక్సిజన్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నాం' - ap govt news

రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి పలు జిల్లాలో మూతపడిన పరిశ్రమలను గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత నివారణకు ప్రభుత్వం అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

chief health secretary anil singhal
వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి
author img

By

Published : May 12, 2021, 9:43 PM IST

రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి, ఆక్సిజన్ ఉత్పత్తికి ప్రభుత్వం నిర్ణయించిందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. దేశ, విదేశాల నుంచి కష్టకాలంలో రాష్ట్రప్రజలను ఆదుకోడానికి దాతలు ముందుకొస్తున్నారని, వారి కోసం సెల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృథాను అరికట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్రంలో ఆక్సిజన్ రవాణా కెపాసిటీని 350 టన్నుల నుంచి 590 టన్నులకు పెంచుకున్నామని.. ట్యాంకర్ల ద్వారా ఆక్సిజన్​ను సకాలంలో ఆసుపత్రులకు పంపించాలనే లక్ష్యంతో చిన్న చిన్న ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నామన్నారు. తిరుపతి పద్మావతి, రుయా, కడప, విజయనగరం ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని చెప్పారు.

రాష్ట్రానికి రానున్న 20 టన్నుల కెపాసిటీ ట్యాంకర్లు..

కేంద్ర ప్రభుత్వం మూడు ట్యాంకర్లను రాష్ట్రానికి కేటాయించగా, ఇప్పటికే ఒక ట్యాంకర్ వచ్చిందన్నారు. 20 టన్నుల కెపాసిటీ కలిగిన మరో రెండు ట్యాంకర్లు పశ్చిమ బెంగాల్ నుంచి రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలకు చెందిన ఆక్సిజన్ సిలిండర్లు 17 వేలుగా ఉండగా, ఇప్పటివరకు 14 వేల 338 సిలిండర్లను గుర్తించామన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆ సిలిండర్లను కరోనా వైద్య సేవలకు మరల్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే 6 వేల 917 సిలిండర్లు వైద్యానికి మార్చామని తెలిపారు. ఆక్సిజన్ కొరత నివారణకు అన్ని మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోందన్నారు. రాష్ట్రంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి, వాటిలో ఉత్పత్తికి ఆయా ప్లాంట్ల యాజమాన్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోందన్నారు.

పరిశ్రమల శాఖాధికారులతో చర్చలు..

అనంతపురం, గుంటూరు, కడప, విశాఖపట్నంలో మూతపడిన ప్లాంట్లను గుర్తించి వాటి సామర్థ్యం మేరకు 37 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన మరిన్ని ప్లాంట్లను గుర్తించి, ఆక్సిజన్ ఉత్పత్తికి పరిశ్రమల శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. నైట్రోజన్ ప్లాంట్లను గుర్తించామని, వాటి ద్వారా ఆరు టన్నుల ఆక్సిజన్​ను ఈ నెలాఖరులోగా సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఏపీ పేపర్ మిల్స్ వంటి పెద్ద ప్లాంట్లును కూడా గుర్తించామని.. వాటితో పరిశ్రమల శాఖాధికారులు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ అందుబాటులోకి వస్తే మరింత లబ్ధి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 వేల ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు కొనుగోలు చేయాలని గతంలో నిర్ణయించామని తెలిపారు. ఈ నెలాఖరులోగా 8 వేల 5 లీటర్ల ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు రాష్ట్రానికి వస్తాయని భావిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

బస్సులో ప్రాణవాయువు.. కొవిడ్ రోగులకు ఆయువు

పెద్ద కొడుకు చితి ఆరకముందే చిన్న కుమారుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.