వరుసగా కోళ్లు, కాకులు చనిపోతున్న ఘటన వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దొర్నాల్లో చోటుచేసుకుంది. గత మూడు నాలుగు రోజుల నుంచి కోళ్లు, కాకులు చనిపోతున్నాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కుక్కలు కూడా మృత్యువాత పడ్డాయని తెలిపారు. ఎందుకిలా కోళ్లు, కాళ్లు చనిపోతున్నాయో అర్థం కావడం లేదని గ్రామస్థులు భయపడుతున్నారు.
ఈ అంశంపై పశువైద్యాధికారులను అడిగితే... పౌడర్ ఇచ్చారని... అయినా కూడా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. అనుమానం వచ్చి ఓ కోడి కోసి చూస్తే పేగులు మొత్తం పాడైపోయాయని గ్రామస్థులు వివరించారు. గ్రామానికి ఏదో కీడు జరిగిందని భయపడుతున్నారు. వందలాది కోళ్లు చనిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
ఇదీచదవండి: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ