ETV Bharat / city

అలాంటి వారికి పోలీసుల సహకారం తగదు: డీజీపీకి చంద్రబాబు లేఖ - cbn letter to dgp news

డీజీపీ గౌతమ్​ సవాంగ్​కు తెదేపా అధినేత లేఖ రాశారు. ప్రభుత్వ ప్రతీకార చర్యలకు పోలీసుల సహకారం తగదని హితవు పలికారు. బలహీనవర్గాల నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

chandrababu letter to dgp
డీజీపీకి చంద్రబాబు లేఖ
author img

By

Published : Jun 18, 2020, 10:18 AM IST

తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు మూడు పేజీల లేఖ రాశారు. ప్రభుత్వం ప్రజలపై ప్రతీకార చర్యలు కొనసాగిస్తుంటే అందుకు పోలీసులు సహకారం అందించడం తగదని హితవు పలికారు. వైకాపా నేతలు.. తమ ప్రతీకారేచ్ఛకు పోలీసుల్ని పావులుగా వాడుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు.

పోలీస్ బాస్​గా పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీపై ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే నియంత రాజకీయాలకు చికిత్స అని అంబేద్కర్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్​లో ప్రస్తుత పరిస్థితులు అందుకు తగ్గట్టే ఉన్నాయన్నారు. ఇలాంటి నియంత రాజకీయాలకు చెక్ పెట్టేలా పోలీసులు వ్యవహరించాలని కోరారు.

బలహీనవర్గాల నాయకులే లక్ష్యంగా తప్పుడు కేసులు నమోదవుతున్నాయని... మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నమోదు చేసిన కేసులు కుట్రలో భాగమేనన్నారు. వైద్యులు సుధాకర్, అనితారాణిల ఘటన లో పోలీసుల తీరు ప్రజలంతా చూశారని విమర్శించారు.

అచ్చెన్నాయుడును చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని..., అధికార వైకాపాను టార్గెట్ చేస్తున్న నేతలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకొని వేధింపులకు గురిచేసే తీరు మంచిది కాదని హితవు పలికారు. అయ్యన్న పాత్రుడు ప్రజాసేవలో నాలుగు దశాబ్దాలుగా ఉన్నారని... ఎలాంటి మచ్చ లేని అలాంటి నాయకుడిపై తప్పుడు కేసు పెట్టారని ఆదేవన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.