తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 1984లో తెదేపా పోరాటాన్ని ప్రపంచం మొత్తం అభినందించిందని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీలకు ఆ అవకాశం వచ్చిందన్న ఆయన... ఎమ్మెల్సీలు విశ్వసనీయత, విలువలతో నిలబడ్డారని అభినందించారు. రాజధానుల బిల్లుల వ్యవహారంలో నాటి పోరాటాన్ని గుర్తుచేసిన ఎమ్మెల్సీలను అభినందించారు. పార్టీ కోసం చేసిన త్యాగాలే చరిత్రలో నిలిచి ఉంటాయన్న చంద్రబాబు.. ప్రలోభాలకు లొంగిన వారు తెరమరుగవుతారని స్పష్టం చేశారు. పార్టీ కోసం పోరాడేవాళ్లకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వాళ్లంతా చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
కోటగోడలా నిలబడ్డారు
శాసనమండలిలో యనమల ధ్వజస్తంభం మాదిరిగా నిలబడ్డారన్న చంద్రబాబు.. తెదేపా ఎమ్మెల్సీలంతా కోటగోడలా ఉండి బిల్లులను అడ్డుకున్నారని ప్రశంసించారు. ప్రజలు ఒక్కసారే జగన్ చేతిలో మోసపోయారన్న ఆయన.. మళ్లీ మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. ప్రజల గుండెల్లో నుంచి తెదేపాను తుడిచేయడం అసాధ్యమని చంద్రబాబు తెలిపారు.
ఇదీ చదవండి: