హామీ నిలబెట్టుకోండి
పరస్పర సహాయక సహకార చట్టం 1995 కింద రిజిష్టర్ అయిన గ్రామ, పట్టణ సంఘాల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం ఎన్టీఆర్ తెచ్చిన చట్టస్ఫూర్తికి తూట్లు పొడవటమేనని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఓఏల వేతనాన్ని రూ. 10 వేలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరిగి చెప్పి... అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ఉద్యోగాల నుంచే తొలగించేందుకు సీఎం జగన్ కుట్ర చేయటం అమానుషమని చంద్రబాబు ఆరోపించారు. 6 నెలల నుంచి ఒక్క రూపాయి వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఉద్యోగ భద్రత కల్పించండి
వైకాపా నాయకుల వేధింపులు, ప్రభుత్వ వైఖరితో వీఓఏలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆవేదన చెందారు. వీఓఏలకు నెలకు 10 వేల చొప్పున వేతనాన్ని ఇస్తానన్న వాగ్దానాన్ని సీఎం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. వేతన బకాయిలను వెంటనే చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ... చంద్రబాబు ఓ ప్రకటన జారీ చేశారు. వీఓఏలను తొలగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించటంతో పాటు... న్యాయపరమైన పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :