రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్‌కు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఎస్‌ఈసీని తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని నిబంధన 243(కె) ప్రకారం 2016లో ఐదేళ్ల కాలపరిమితికి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్‌ఈసీగా నియమించారని గుర్తు చేశారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన ఈ సమయంలో... దొడ్డిదారిన ఎస్‌ఈసీని మార్చాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ఇలా అర్ధాంతరంగా కమిషనర్‌ను మార్చడం అనైతికం, చట్టవిరుద్ధమని అన్నారు. ఏ నిబంధన అయినా ప్రస్తుత కమిషనర్ పదవీకాలం ముగిసిన తర్వాతే అమలు చేయాలని తెలిపారు. ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసి రాజ్యాంగాన్ని కాపాడాలంటూ గవర్నర్‌కు ఈ మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశానని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి :