ETV Bharat / city

వైకాపా రౌడీలబారి నుంచి గ్రామాలను రక్షించుకోవాలి: చంద్రబాబు - chandrababu latest news

తొలి దశ పంచాయితీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకూ అభ్యర్ధులు, పార్టీ కార్యకర్తలు పట్టుదలగా పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులంతా హాజరవ్వాలని, వైకాపా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. పలుచోట్ల వైకాపా మద్దతుదారులు, పోలీసు అధికారులు..... ఏకగ్రీవం చేసేలా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేతలు ఫిర్యాదులు చేశారు.

chandrababu
chandrababu on local elections
author img

By

Published : Feb 1, 2021, 3:31 AM IST

Updated : Feb 1, 2021, 6:04 AM IST

తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల నాయకులతో తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎక్కడైనా నామినేషన్లను అక్రమంగా తిరస్కరించి అభ్యర్థులకు అన్యాయం చేస్తే, సదరు అధికారుల పేర్లతో సహా, పూర్తి సమాచారాన్ని పార్టీ కంట్రోల్‌ రూమ్‌కు తెలియజేయాలని సూచించారు. వైకాపా దాడులు, దౌర్జన్యాల ఫోటోలు, వీడియో సాక్ష్యాధారాలను కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘం, తెదేపా కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలని.. వైకాపా గూండాలు, రౌడీల బారి నుంచి గ్రామాలను రక్షించుకోవాలని సూచించారు.

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు...

నామినేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లాలో పలు చోట్ల సర్పంచి అభ్యర్థులను వైకాపా ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి బెదిరించారని... తెదేపా నేత పరిటాల శ్రీరామ్‌ ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా రేపల్లె గ్రామీణ మండలంలోని పలు గ్రామాల్లో అభ్యర్థులను... రేపల్లె పట్టణ సీఐ సాంబశివరావు బెదిరిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బీరకుప్పం సర్పంచి అభ్యర్థి...... అధికార పార్టీ అండతో ప్రలోభాలకు గురిచేస్తున్నారని న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెల్దుర్తిపాడు చెక్‌పోస్టులో విధులు నిర్వర్తిస్తున్న వత్సవాయి రామకృష్ణ... అక్రమంగా మద్యం రవాణాకు సహకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పలుచోట్ల కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా తహశీల్దార్లు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ తెలుగుదేశం నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు.

ఎస్ఈసీకి లేఖ...

పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు గ్రామ వాలంటీర్లను విధులకు దూరంగా ఉంచాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

ఇదీ చదవండి

తొలిదశ నామినేషన్ల చివరిరోజు దాడుల పర్వం

Last Updated : Feb 1, 2021, 6:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.