తెలుగుదేశం అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా పలువురు నేతలు శుభాంకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని భాజపా సీనియర్‌నేత నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. సురేష్ ప్రభుతో పాటు రాష్ట్ర సీనియర్ నేత శత్రుఘ్నసిన్హా, రాజ్యసభ్యుడు సుజనాచౌదరి, మాజీ మంత్రి మాణిక్యలరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్న ఆయన రాష్ట్రాభివృధికి వినూత్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. అలాగే హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సంపూర్ణ జీవితం గడపాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.
ఇవీ చదవండి: 'చాలా నిజాయతీగా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఆర్డర్ చేశాం'