మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆ మహాత్మునికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గాంధీజీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే ప్రతి పల్లె స్వయం సమృద్ధిని సాధించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పల్లెల్లో ప్రశాంతత నెలకొనాలని ఆశించారు.
కానీ... వైకాపా ప్రభుత్వ పాలనలో రాత్రికి రాత్రి ప్రజలను విడదీస్తూ గోడలు వెలుస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కక్షలు, కబ్జాలు, ఆక్రమణలు, ఆక్రందనలతో పల్లెలు అల్లాడుతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. గాంధీజీ ఆశించిన రీతిలో పల్లెలు మళ్లీ వెలగాలని ఆకాక్షించారు. అప్పుడే దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలకు అర్థం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
రాజకీయ ఉద్యమాలలో అహింస, సత్యాలను మొదటిసారిగా ఆచరించి విజయం సాధించిన మహనీయుడు గాంధీజీ అని నారా లోకేశ్ గుర్తుచేశారు. అంతిమ విజయం సత్యానిదేనని, ఈ రోజు దేశం అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్న సందర్భంగా మహోన్నత త్యాగాలను చేసిన వీరులకు గౌరవవందనం చేద్దామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: