ఆంధ్ర షుగర్స్ సంస్థ వ్యవస్థాపకులు, మాజీ శాసనసభ్యులు ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మొదటి తరానికి చెందిన పారిశ్రామిక వేత్తగా, ఆంధ్రా బిర్లాగా ప్రసిద్ధికెక్కారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కొనియాడారు. ఆయన శతజయంతి సందర్భంగా హరిశ్చంద్ర ప్రసాద్ దాతృత్వాన్ని, సమాజసేవను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఆంధ్ర షుగర్స్ అనే వ్యవసాయ ఆధారిత చక్కెర పరిశ్రమను స్థాపించి రైతులకు, యువతకు ముళ్లపూడి ఎంతో మేలు చేశారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. దేశంలోనే మొదటి ఆస్ప్రిన్ ఫ్యాక్టరీ పెట్టిన దార్శనికులు, ఇస్రో రాకెట్లకు ఇంధనాన్ని సరఫరా చేసిన ఆధునికులు, పారిశ్రామిక రంగంలోనే కాకుండా రాజకీయ, సామాజిక సేవా రంగాలలోనూ తన ప్రత్యేకతను చాటారని కీర్తించారు. ఆయన శతజయంతి సందర్భంగా వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలను స్మరించుకుందామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Steel plant: దేశ ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న నిర్ణయాలపై.. విచారణ తగదు: కేంద్రం