చెస్ ఒలింపియాడ్‌లో స్వర్ణ విజేతలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అభినందనలు తెలిపారు. రష్యాతో పాటు ఉమ్మడిగా భారత జట్టు బంగారు పతకం సాధించడం ఎంతో గర్వకారణమని చంద్రబాబు కొనియాడారు. భారత విజయంలో కోనేరు హంపీ, విశ్వనాథన్ ఆనంద్, ప్రజ్ఞానంద కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. భారత చదరంగ జట్టు అందరూ గర్వపడేలా చేసిందని నారా లోకేశ్ అభినందించారు. విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి నిజమైన మాస్టర్లని ప్రశంసించారు.
తెలుగు క్రీడాకారిణి కోనేరు హంపి ప్రతిభ చాటడంతో భారత్ ఫైనల్ వరకు వెళ్లింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్, రష్యాలు సంయుక్తంగా విజేతలుగా నిలిచినట్లు ఫిడె ప్రకటించింది. మొట్టమొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన చెస్ ఒలింపియాడ్‌లో ఫైనల్‌కు చేరుకుని విజేతలుగా నిలిచిన రష్యా, భారత్ జట్లకు బంగారు పతకాలు ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు ఫిడె తెలిపింది.
ఇదీ చదవండీ... ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు స్వర్ణం