ETV Bharat / city

అప్పుల్లో ఏపీని నంబర్ వన్ చేశారు : చంద్రబాబు - చంద్రబాబు వార్తలు

కక్ష సాధింపే లక్ష్యంగా సీఎం జగన్ సాగిస్తున్న పాలనతో రాష్ట్రం బిహార్‌ కంటే దిగజారే ప్రమాదంలో పడిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. ప్రతీకారం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతుండటంపై జాతీయ మీడియానే ఖండించే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. దావోస్‌ అంటేనే ఏపీ అనే పరిస్థితి నుంచి ఈసారి అక్కడికెళ్లిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రం అంటే భయం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చిందన్నారు. 9నెలల పాలనలో ఇచ్చిన పథకాల కంటే రద్దు చేసినవే ఎక్కువని పేర్కొన్నారు. విధ్వంస పాలనతో స్థితిమంతులకు పెద్దగా ప్రమాదముండదన్న చంద్రబాబు.... పేదలే ఆలోచించుకోవాలని హితవు పలికారు. వైకాపా సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు.

chandra babu
chandra babu
author img

By

Published : Feb 3, 2020, 8:40 PM IST

Updated : Feb 4, 2020, 6:35 AM IST

వైకాపా పాలనపై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు

రాజధాని అమరావతి అంశం సహా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని... తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులకే ఉద్యోగాలు, పీపీఏల రద్దు, 3 రాజధానుల విషయంలో జగన్ తీరుకు దేశమంతా వ్యతిరేకత వ్యక్తమైందని గుర్తు చేశారు. ఈ విషయాలను జాతీయ మీడియా తీవ్రంగా ఆక్షేపించిందన్నారు. ఆయా పత్రికల కథనాలకు సంబంధించిన క్లిప్పింగులను మీడియా సమావేశంలో చంద్రబాబు ప్రదర్శించారు. 3 రాజధానులతో ఖర్చులు పెరగడం మినహా ఒరిగేదేమీ ఉండదని... అమరావతి పరిరక్షణ 5 కోట్ల ప్రజల సమష్టి బాధ్యత అని అన్నారు. ఒక వ్యక్తి మూర్ఖత్వంతో ఈ రాష్ట్రం ఏమవుతుందో, ఎక్కడికి పోతుందన్నది... ప్రతిఒక్కరూ ఆలోచించాలని చంద్రబాబు సూచించారు.

అప్పుల్లో ఏపీని నంబర్ వన్ చేశారు : చంద్రబాబు

అలా చేస్తే అభివృద్ధి జరగదు

ప్రపంచంలో దక్షిణాఫ్రికాలో తప్ప ఎక్కడా 3 రాజధానులు లేవని చంద్రబాబు అన్నారు. వేర్వేరు రాజధానులతో సమస్యలు వస్తున్నాయని దక్షిణాఫ్రికా అధినేత అన్నారని గుర్తు చేశారు. రాజధాని మార్పు వల్ల వచ్చే సమయం, ఖర్చు గురించి ఆలోచించారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార వికేంద్రీకరణ, కార్యాలయాలు కట్టినంత మాత్రాన అభివృద్ధి జరగదని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ విధానాలను దావోస్ సదస్సులో అనేక మంది విమర్శించారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

పెట్టుబడులు వెనక్కి...

వైకాపా ప్రభుత్వ విధానాల వల్ల అదానీ డేటా సెంటర్, లులు, పేపర్ మిల్ సహా ఎన్నో సంస్థలు రాష్ట్రాన్ని విడిచిపోయాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కియా అనుబంధ పరిశ్రమలు వేరేచోట్లకు మళ్లాయని వెల్లడించారు. ప్రభుత్వ చర్యల వల్ల రూ.79 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లాయని మండిపడ్డారు. అలాగే అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌ను విమర్శించి.. అక్కడెలా చేస్తారని ప్రశ్నించారు.

అమరావతి రైతులపై మీకు ఎందుకంత కక్ష?

'ఉత్తరాంధ్ర, రాయలసీమకు ద్రోహం చేసిందెవరు? గుండ్రేవుల, వేదవతి, రాజోలిబండ, భైరవాని తిప్ప ప్రాజెక్టులు ఆపేశారు. సాగునీటి ప్రాజెక్టులకు 9నెలల్లో రూపాయైనా ఖర్చు పెట్టారా? మీరు చేస్తున్న పనులకు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. సీఎస్‌ స్థాయి వ్యక్తిని బాపట్లకు పంపించడం దారుణం. పీపీఏల సమీక్ష వద్దని కేంద్రం చెప్పినా వీళ్లు వినలేదు. కక్ష సాధింపు, విద్వేషం తప్ప మీకు పాలనపై దృష్టి లేదు. కక్షలు, కార్పణ్యాలకు ఇది సందర్భమా? అమరావతిలో 10 వేల ఎకరాల భూమి నుంచి రూ.2లక్షల కోట్ల సంపద వచ్చేది. అమరావతి రైతులపై మీకు ఎందుకంత కక్ష? విశాఖ, కర్నూలులో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి' అని చంద్రబాబు సూచించారు.

హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారా?

'వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లో రూ.72 వేల కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. పన్ను వసూళ్లు బాగా తగ్గిపోయాయి. అప్పులు మాత్రం 16 శాతం పెరిగాయి. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం కూడా 6 శాతం పెరిగింది. మీ చేతకాని విధానాలతో రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు. కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లకు ఎందుకు నిధులివ్వలేదు? విద్యార్థులకు ఈ ఏడాది ఉపకార వేతనం ఇచ్చారా? అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా గురించి ఎప్పుడైనా మాట్లాడారా? మనకు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని అడిగారా? కుంటిసాకులు చెప్పి అన్ని పథకాల్లో కోతలు పెడుతున్నారు. చివరికి అన్నీ రద్దు చేసి రైతుభరోసా ఇచ్చారు.. దానిలోనూ అనేక నిబంధనలు పెట్టారు. అధికారంలోకి వచ్చాక గుత్తేదారులకు రూపాయి అయినా చెల్లించారా? కేంద్రం చెప్పినా, కోర్టులు విమర్శించినా మీరు మారరా?' అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

రాజధాని ఒకే ప్రాంతంలో ఉండాలి: టీజీ వెంకటేశ్

Last Updated : Feb 4, 2020, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.