ETV Bharat / city

టచ్​ పాయింట్లు తగ్గించి.. ఆన్​లైన్ లావాదేవీలు పెంచాలి: చంద్రబాబు

author img

By

Published : Apr 18, 2020, 8:47 PM IST

విదేశాల్లోని తెలుగువారితో తెదేపా అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా విస్తరణ దృష్ట్యా అందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్రం కోసం తోచిన సాయం చేయాలని చంద్రబాబు కోరారు. తెలుగు వారంతా తమ ఆలోచనలు పంచుకోవాలన్న తెదేపా అధినేత.. టచ్​ పాయింట్లు తగ్గించి డిజిటల్ లావాదేవీలు పెంచాలని సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా డోర్ డెలివరీ విధానాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

chandrababu
chandrababu
విదేశాల్లోని తెలుగు వారితో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్

వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారితో తెదేపా అధినేత చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఈ విపత్కర పరిస్థితుల్లో విజ్ఞానం, సాంకేతికత రెండూ అనుసంధానం కావాలని చంద్రబాబు అన్నారు. టచ్ పాయింట్లు తగ్గిస్తేనే కరోనా కట్టడి సాధ్యమన్న ఆయన... లాక్​డౌన్ వల్ల కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తి తగ్గినా, మళ్లీ నిదానంగా పెరుగుతున్నాయన్నారు. భారత్​లో కేసుల సంఖ్య రెట్టింపు... గతంతో పోలిస్తే కాస్త నెమ్మదిగా ఉందని చెప్పారు. కేరళ కరోనాను సమర్థంగా ఎదుర్కొందని.. ఆ రాష్ట్రంలో ఎక్కువ పరీక్షలు నిర్వహించడమే దానికి కారణమన్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా శ్రేయస్సు కోసం తమ వంతు చర్యలు చేపట్టడమని తెలిపారు.

'సాయం చేసేందుకు ముందుకు రండి'

కరోనాపై అధ్యయనానికి ఉత్తమ విధానాలను ప్రోత్సహించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టచ్ పాయింట్లు తగ్గించేందుకు ఎక్కువగా డిజిటల్ లావాదేవీలు చేయాలన్నారు. ఇందుకు ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. ఆన్​లైన్​ ద్వారా డోర్ డెలివరీ విధానాలు పెరగాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా తమ ఆలోచనలు పంచుకోవాలని.. రాష్ట్రం కోసం తోచిన సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వైద్యులూ కరోనా బారిన పడుతున్నారన్న ఆయన.. ప్రతిఒక్కరూ తప్పక జాగ్రత్తలు పాటించాలన్నారు.

సీబీఎన్ ఫౌండేషన్ వినూత్న ఆలోచనలకు వేదిక

కరోనా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాప్రభుత్వం రాజకీయం చేస్తోందని చంద్రబాబు అన్నారు. ఎస్‌ఈసీ తొలగింపు, రాజధాని మార్పు వంటివి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తూ సూచనలు ఇస్తున్నా వినే పరిస్థితిలో లేరన్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారికి ప్రత్యేకంగా కొన్ని సమస్యలు ఉన్నాయని.. అలాంటి వారిని ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. సమాచార సేకరణకు వివిధ వేదికలు సిద్ధం చేస్తున్నామన్న ఆయన.. ఒక బలమైన వేదికను రూపొందించి అందరి ఆలోచనలు పొందుపరుస్తామన్నారు. సీబీఎన్ ఫౌండేషన్ ద్వారా వినూత్న ఆలోచనలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. పుట్టిన దేశంతో పాటు ఎదిగిన దేశానికి ప్రవాసాంధ్రులు సేవచేయాలన్నారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ పిటిషన్​ తిరస్కరించాలంటూ.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.