కోర్టు ధిక్కరణ కేసులో వక్ఫ్ బోర్డ్ సీఈవో అలీం బాషాకు హైకోర్టు రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే మూడు రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ఈ తీర్పుపై అప్పీలు దాఖలు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ...తీర్పు అమలును రెండు వారాలు నిలుపుదల చేశారు. కర్నూలు జిల్లా అల్లూరు మండలం మెులగవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 662 లో ఉన్న 18 ఎకరాలను ప్రభుత్వ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు సీఈవోను 2019 డిసెంబర్లో హైకోర్టు ఆదేశించింది. సీఈవో ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవటంతో బి. శివానందం అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి సీఈవో ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ జైలు శిక్ష విధించారు.
ఇదీ చదవండి: