central Minister Jaishankar letter to CM Jagan: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మనదేశ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం పూర్తిస్థాయి చర్యలు తీసుకుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఏపీ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా వెనక్కు తీసుకురావటానికి వీలుగా వారి సమాచారాన్ని నేరుగా కార్యాలయానికి అందించాలని కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు ఆయన సోమవారం లేఖ రాశారు. ‘ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి సమాచారాన్ని, వివరాలు సహా పంపితే అవసరమైన సాయాన్ని త్వరితగతిన అందించడం సాధ్యమవుతుంది. బాధితుల సమాచారాన్ని useamo@mea.gov.in/adlpseam@mea.gov.in, వాట్సప్ నంబర్లు: +91 9871288796/ +91 9810229322 ద్వారా నేరుగా విదేశీ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపవచ్చు. అక్కడ చిక్కుకున్న వారి భద్రతకు సంబంధించి కుటుంబసభ్యులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. వారికి అవసరమైన సమాచారాన్ని అందించటానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. విద్యార్థులు/పౌరుల సమాచారాన్ని తెలుసుకోవడానికి 1800118797(టోల్ ఫ్రీ)/+91 11-23012113/23014104/23017905 నంబర్లలో సంప్రదించాలి’ అని లేఖలో కేంద్రమంత్రి సూచించారు. వీటితోపాటు ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారికి రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలూ అందుబాటులో ఉన్నాయన్నారు. ఆ వివరాలు...
రొమేనియా: controlroombuncharesi@gmail.com
* 40 732 124309/771 632567/745 161631/740 528123
పోలెండ్: controlroominwarsaw@gmail.com
* +48 225400000/795850877/792712511
హంగరీ: whatsapp: +36 308517373
+36 308517373/13257742/13257743
స్లోవేకియా: hoc.bratislava@mea.gov.in
+421 252631377/252962916/951697560
617 మంది వివరాలు సేకరణ: కృష్ణబాబు
ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో ఇప్పటి వరకు 617 మంది సమాచారం సేకరించామని, వారిని వెనక్కి రప్పించేందుకు నిరంతరం కృషిచేస్తున్నట్లు ఏపీలో ఉక్రెయిన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఇప్పటి వరకు 32 మంది రాష్ట్రానికి చేరుకొని, స్వస్థలాలకు వెళ్లారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లోని విద్యార్థులకు అందుతున్న సాయం, వారి పరిస్థితిపై చంద్రబాబు ఆరా