ETV Bharat / city

MISUSING MPLADS FUNDS IN AP: ఎంపీ లాడ్స్ నిధులపై నివేదిక పంపండి.. ఏపీకి కేంద్రం ఆదేశం - ఎంపీలాడ్స్ పై ఏపీకి కేంద్రం లేఖ

ఎంపీ లాడ్స్ నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరోసారి లేఖ(center letter to ap govt over MPLADS funds ) రాసింది. నిధుల ఖర్చుపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలోనే ఇవ్వాలని చెప్పినా.. ఏపీ ప్రభుత్వం స్పందించకపోవటంతో తాజాగా కేంద్రం.. ఈ లేఖలను పంపింది. ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు(MP Raghu Ramakrishna Raju letter to PM modi aout MPLADS) మేరకు కేంద్ర ప్రభుత్వం.. ఈ చర్యలు చేపట్టింది.

MPLADS FUNDS IN AP
MISUSING MPLADS FUNDS IN AP
author img

By

Published : Nov 27, 2021, 3:25 PM IST

చర్చిలకు ఎంపీ లాడ్స్ నిధుల ఖర్చు(MPLADS FUNDS SPENDING ON CHURCHES IN AP)పై నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యకార్యదర్శికి లేఖలు పంపింది. పీఎంవోకు వివరాలు ఇవ్వాల్సి ఉన్నందున తక్షణమే నివేదిక పంపాలని ఆదేశాల్లో పేర్కొంది. చర్చికి నిధుల కేటాయింపుపై ఇటీవల ప్రధానికి ఎంపీ రఘురామ లేఖ(MP Raghu Ramakrishna Raju letter to PM about misusing MPLADS funds in ap)రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. నివేదిక ఇవ్వాలని రాష్ట్రాన్ని 2 నెలల క్రితమే లేఖ రాసింది. కానీ ఏపీ సర్కార్ స్పందించకపోవడంతో కేంద్ర గణాంకాల శాఖ మరోసారి ఈ లేఖలు రాసింది.

గతంలోనే ఆదేశాలు..
ఏపీలో ఎంపీలాడ్స్ నిధుల దుర్వినియోగంపై వివరణ ఇవ్వాలంటూ గతంలోనే కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వ(The Ministry of Statistics and Programme Implementation dept) శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ(Center letter to ap over MP lads funds news) రాసింది. నిబంధనల అనుగుణంగా ఎంపీలాడ్స్ నిధులు ఖర్చు చేయకపోవటంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ప్రణాళికా విభాగం ముఖ్యకార్యదర్శికి కేంద్రం ఈ లేఖ పంపింది. మతపరమైన భవనాల నిర్మాణానికి, మరమ్మతుల కోసం ఎంపీలాడ్స్ నిధులు కేటాయించారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వివరణ కోరుతున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.

పీఎంవో ఆదేశాల మేరకే లేఖ..
ఎంపీలాడ్స్(Members of Parliament Local Area Development) నిధుల దుర్వినియోగంపై పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణరాజు(mp raghu rama krishnam raju news) చేసిన ఫిర్యాదు మేరకు ప్రధాని కార్యాలయం స్పందించిందని అక్కడినుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ లేఖ రాస్తున్నట్టు కేంద్ర గణాంక శాఖ పేర్కొంది. బాపట్లలోని ఓ చర్చి నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.86 లక్షలను ఖర్చు చేయటం సహా చాలా చోట్ల ఇదే తరహాలో వ్యయం చేశారని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఏపీ నుంచి వివరణ కోరాల్సిందిగా సంబంధిత కేంద్ర మంత్రిత్వశాఖకు పీఎంఓ ఆదేశాలు ఇచ్చింది.స్పష్టమైన నిబంధనలు.. ఎంపీలాడ్స్ నిధుల వ్యయాన్ని పర్యవేక్షించాల్సిన రాష్ట్రస్థాయి నోడల్ విభాగం, జిల్లా అధికారులు కూడా నిబంధనలు పాటించకపోవటాన్ని కేంద్రం ఆ లేఖలో ప్రశ్నించింది. ఎంపీ లాడ్స్ మార్గదర్శకాల మేరకు నిధులను మతపరమైన సంస్థలకు వ్యయం చేయరాదని అలాగే ఆయా సంస్థలు, గ్రూపులకు చెందిన స్థలాల్లోనూ నిర్మాణం చేయకూడదని స్పష్టం చేసింది. దీంతో పాటు ఎలాంటి కట్టడాలైనా పునర్నిర్మాణం, మమ్మరమ్మతులకూ ఎంపీ లాడ్స్ వినియోగించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొంది.

సమగ్రమైన నివేదిక ఇవ్వండి..
ఎంపీ లాడ్స్(Members of Parliament Local Area Development funds news) నిధుల వినియోగాన్ని సమీక్షించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఏడాదికి ఓమారైనా సమావేశం కావాలని కేంద్రం సూచించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన అన్ని నోడల్ విభాగాలతోనూ నిర్వహించి అవి దుర్వినియోగం కాకుండా చూడాలని స్పష్టం చేసింది. దీంతో పాటు ఎంపీలాడ్స్ నిధులకు సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులు, పనులు ఉన్నాయా..? లేదా అన్నది..? జిల్లా యంత్రాంగం సరిచూసుకోవాలని దీనికి జిల్లా అధికారే బాధ్యులు అవుతారని లేఖలో స్పష్టం చేసింది. ఎంపీలాడ్స్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి సమగ్రమైన వాస్తవిక నివేదికతో పాటు ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై కూడా నివేదిక పంపాలని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ ఆదేశించింది. కానీ ఏపీ ప్రభుత్వం స్పందించకపోవటంతో.. తాజాగా మరోసారి లేఖలు పంపింది.

ఇదీ చదవండి

WEATHER UPDATE: రాష్ట్రానికి మరో టెన్షన్​... వరద ముంపు నుంచి తేరుకోలేదు.. మళ్లీ మరో అల్పపీడనం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.