ETV Bharat / city

'కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది'.. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో ముఖాముఖి - Our representative Rajkumar interviews with Director Rakesh Mishra.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వ్యాక్సిన్‌ ఎప్పటిలోగా వస్తుందన్న దానిపై ఏకాభిప్రాయం లేకుండా పోయింది. కొందరేమో వ్యాక్సిన్‌ తప్పుకుండా వస్తుందని అంటున్నారు. మరికొందరు దీనికి భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశీయంగా, అంతర్జాతీయంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి, వ్యాక్సిన్‌ లేనిపక్షంలో పరిస్థితి, తదితర విషయాలపై సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో మా ప్రతినిధి రాజ్‌కుమార్ ముఖాముఖి.

carona vaccine
డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో మా ప్రతినిధి రాజ్‌కుమార్ ముఖాముఖి.
author img

By

Published : May 12, 2020, 3:04 PM IST

డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో మా ప్రతినిధి రాజ్‌కుమార్ ముఖాముఖి.

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చే అవకాశముందా?

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ ఎప్పుడు కనుగొంటారన్నది చెప్పలేం. అయితే 6 నెలల్లో రావచ్చు... లేదా 8నెలల్లో రావచ్చు... లేదా చాలా ఏళ్లు పట్టవచ్చు. వైరస్‌ చాలా మార్పులు చెందుతోంది. దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది చాలా సంక్లిష్టమైనది. 6 లేదా 8 నెలల్లో వ్యాక్సిన్‌ రావొచ్చేమోనని చెప్పగలను.

వైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొంటామని కొందరు చెబుతున్నారు. కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు?

వ్యాక్సిన్‌ విషయంలో కచ్చితంగా చెప్పలేం. మందుల విషయంలోనూ అదే వర్తిస్తుంది. దానికి కారణమేంటంటే వైరస్‌ చాలా మార్పులు చెందుతోంది. పరిశోధనలు చేసే క్రమంలో మరో రూపంలోకి మారుతోంది. ఇప్పటికే ఫ్లూ, హెచ్‌ఐవీ వంటి వాటికి వ్యాక్సిన్‌ లేదు. ఎందుకంటే అవి మార్పులు చెందుతున్నాయి. అయిన్నప్పటికీ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వస్తుందని నేను ఆశిస్తున్నాను. కానీ కొంచెం సమయం పడుతుంది.

వ్యాక్సిన్‌ కనుగొనకుంటే ప్రత్యామ్నాయాలేంటి? పరిస్థితులు ఎలా ఉంటాయి?

వ్యాక్సిన్‌ లేకుంటే మనుగడ చాలా కష్టమవుతుంది. శుభ్రత పాటించాలి. భౌతిక దూరం పాటించాలి. రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవాలి. ఈ భయంకర పరిస్థితుల నుంచి భవిష్యత్తులో వ్యాక్సిన్‌ రక్షిస్తుంది. ప్రస్తుతం వ్యాక్సిన్‌ లేకపోవచ్చు. ఇప్పటికే చైనా బాగా కోలుకుంటోంది. కానీ వాళ్ల దగ్గర కూడా వ్యాక్సిన్‌ లేదు. మనం కూడా ఇతర దేశాల్లోలాగా ఎక్కువ నష్టం జరగకుండానే కోలుకుంటాం.

చాలా వైరస్‌లకు వ్యాక్సిన్‌ కనుగొన్నారు. కానీ కొన్నింటికి కనుగొనలేదు. అందులో ఒకటి హెచ్‌ఐవీ. దానిలాగే కరోనాకు కూడా వ్యాక్సిన్‌ కనుగొనే అవకాశం లేదా?

కరోనా వైరస్‌ కూడా పరిశోధనలు చేసే క్రమంలో వివిధ రూపాల్లోకి మార్పులు చెందుతోంది. వైరస్‌ జీనోమ్‌ గురించి తెలుసుకుంటున్నాం. ఇది అంత పెద్దగా మార్పులు చెందుతుందని నేను అనుకోవడం లేదు. హెచ్‌ఐవీలా దీని కూడా వ్యాక్సిన్‌ ఉండకుండా పోతుందని అనుకోను.

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం దేశంలో ఎలాంటి కసరత్తు జరుగుతోంది?

చాలా పెద్ద కసరత్తు జరుగుతోంది. చాలా కంపెనీలు, పరిశోధనా సంస్థలు ఇందులో భాగస్వామ్యులయ్యాయి. సీసీఎంబీ కూడా పెద్ద పాత్ర పోషిస్తోంది. పుణెలోని వైరాలజీ, ఐసీఎంఆర్ చాలా కృషి చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ తయారీ కోసం అన్ని శక్తులు ఒడ్డి పని చేస్తున్నారు. వ్యాక్సిన్‌ వస్తే ప్రజలు సాధారణ జీవితం గడపవచ్చు.

మేం మానవ పరిశోధనల దశను ప్రారంభించామని కొన్ని రీసెర్చ్‌ సంస్థలు చెబుతున్నాయి. దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?

దేశంలో ఇప్పటివరకు మానవ సంబంధిత పరిశోధనలు జరగడంలేదు. వ్యాక్సిన్‌ తయారీకి ముందు చాలా పరిశోధనలు ఉంటాయి. మొదట సేఫ్టీ ట్రయల్స్ ఉంటాయి. కొందరి మీద చేశాక పనితీరు బాగుంటే ఆ తర్వాత చాలా మందిపై ప్రయోగిస్తారు. అది సులువైన ప్రక్రియ కాదు. చాలా సమయం పడుతుంది. అన్ని నివేదికలను వివిధ కోణాల్లో పరిశీలించాలి. వ్యాక్సిన్‌ వచ్చాక ఈ క్రమంలో సీసీఎంబీ చాలా పనులు నిర్వహిస్తుంది. జంతువులు, మానవులపై ప్రయోగాలను పరీశీలిస్తుంది. అమలు చేయాలా? వద్దా? అనే బాధ్యత తీసుకుంటుంది.

దేశంలో కొన్ని సంస్థలు వ్యాక్సిన్‌ తయారీ కోసం పాటుపడుతున్నాయి. మరి ప్రభుత్వం పాత్రేంటి?

ప్రభుత్వం క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. మొట్టమొదటగా అన్ని అవకాశాలు కల్పిస్తోంది. చాలా త్వరగా అనుమతులు ఇస్తోంది. ట్రయల్‌ కోసం, పరిశోధన కోసం ఏర్పాట్లు చేస్తోంది. వ్యాక్సిన్‌ తయారీ కోసం అన్ని ప్రక్రియలను సులభతరం చేయడమేగాక... వేగంగా పనులు చేసుకుంటూ పోతోంది. వ్యాక్సిన్‌ తయారీ కోసం ఇది చాలా ముఖ్యమైంది. ఐసీఎంఆర్‌, సీఎస్‌ఆర్‌, డీబీటీ వంటివి సహా ఫండింగ్‌ సంస్థలు భాగస్వామ్యులవుతున్నాయి. ఆయా సంస్థల్లోని నిపుణులను ఉపయోగించడమేకాక వ్యా‌క్సిన్‌ తయారీ కోసం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయి. ఈ క్రతువులో హైదరాబాద్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోంది.

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌కు అప్రూవల్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ పాత్రేంటి?

అప్రూవల్‌ విషయంలో డబ్ల్యూహెచ్‌వో పాత్ర ఏమీ ఉండకపోవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సమాచారం సేకరించి పంచే ఒక వ్యవస్థ. మార్గదర్శకాలు ఇస్తుందే తప్ప నియంత్రణ పాత్ర పోషించదు.

ఇదీ చదవండిః హైదరాబాద్​ను కమ్మేస్తున్న కరోనా..నగరవాసుల హైరానా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.