అక్రమాస్తుల కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలుచేసిన పిటిషన్‌పై.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈ నెల 1న జగన్, రఘురామ తరఫు వాదనలు జరిగాయి. తమ వాదనలు లిఖితపూర్వకంగా సమర్పిస్తామని సీబీఐ తెలిపింది. సీబీఐతో పాటు జగన్, రఘురామకృష్ణరాజు కూడా ఇవాళ లిఖితపూర్వక వాదనలు సమర్పించాలని.. ఈ నెల 1న సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈమేరకు జగన్, రఘురామ, సీబీఐ నేడు లిఖితపూర్వక వాదనలు సమర్పించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
KISHAN REDDY: 'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'
విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం దిశగా కేంద్రం మరో అడుగు.. కన్సల్టెంట్ నియామకానికి నోటిఫికేషన్