పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించటంపై రాజధాని రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాష్ట్ర గవర్నర్ రాజధాని రైతులను మోసగించారని వారు ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని, న్యాయనిపుణుల సలహాలను తీసుకోకుండానే రాజ్యాంగ పదవిలో ఉండి ఈ నిర్ణయం ఎలా తీసుకుంటారని రైతులు ప్రశ్నించారు. ఇక తమకు ఆత్మహత్యలే శరణ్యమని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గుంటూరులో నిరసనలు
మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంపై గుంటూరులో నిరసనలు పెల్లుబికాయి. గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద సీపీఐ, తెదేపా శ్రేణులు నిరసన చేపట్టాయి. గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. రాజధాని అమరావతి అంశం కోర్టు పరిధిలో ఉందని... ఈలోగా హడావుడిగా గవర్నర్ తో ఆమోదింపజేయడాన్ని వారు నిరసించారు. గవర్నర్ ఆమోదించినప్పటికీ ఎస్ఈసీ మాదిరిగానే ఈ రెండు బిల్లులు న్యాయస్థానాల్లో నిలవవని వారు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి
నెలలపాటు సాగింది బిల్లు వివాదం... ప్రభుత్వం నెగ్గించుకుంది పంతం...