ETV Bharat / city

group-1: గ్రూపు-1 మూల్యాంకనంలో అక్రమాలు.. అభ్యర్థుల ఆవేదన - ఏపీ తాజా వార్తలు

మాన్యువల్ మూల్యాంకనం వల్ల అన్యాయం జరిగిందంటూ... ఏపీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఫలితాల తారుమారుపై అనుమానాలున్నాయంటూ... 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌లో మెయిన్స్ రాసిన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ మూల్యాంకనంలో 326 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయితే..... మాన్యువల్ విధానంలో కేవలం 124 మందే ఎంపికయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరపాలంటూ డిమాండ్ చేశారు.

APPSC Group 1
గ్రూపు-1 మూల్యాంకనంలో అక్రమాలు
author img

By

Published : May 31, 2022, 7:15 AM IST

గ్రూపు-1 (2018) ప్రధాన పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని ఏపీపీఎస్సీపై అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు. డిజిటల్‌ విధాన మూల్యాంకనం మాదిరిగానే మాన్యువల్‌ (పెన్నూ-పేపరు) మూల్యాంకన ఫలితాల వెల్లడిలోనూ అభ్యర్థుల నుంచి ఏపీపీఎస్సీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. గతేడాది డిజిటల్‌ మూల్యాంకనంలో 326 మంది మౌఖిక పరీక్షలకు ఎంపికయ్యారు. మాన్యువల్‌ మూల్యాంకన ఫలితాల్లో వీరిలో మౌఖిక పరీక్షలకు 124 (38%) మందే ఎంపికయ్యారు. గతంలో ఎంపికైన 202 మంది పేర్లు తాజా జాబితాలో గల్లంతయ్యాయి. డిజిటల్‌ మూల్యాంకన ఫలితాల్లో 142 మంది తెలుగు మాధ్యమం వారు ఎంపికకాగా.. ఇప్పుడు 47 మందే ఉన్నారని అభ్యర్థులు వాపోయారు.

గ్రూపు-1 ప్రధాన పరీక్షల జవాబుపత్రాలను తొలుత డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశారు. అనంతరం మౌఖిక పరీక్షలకు ఎంపికచేసిన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. తాము నష్టపోయామని, డిజిటల్‌ మూల్యాంకనం గురించి ముందుగా చెప్పలేదని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌ విధానంలో జవాబుపత్రాలను దిద్దించి, ఫలితాలను గత వారం ఏపీపీఎస్సీ వెల్లడించింది. వీటిపైనా విమర్శలు వెల్లువెత్తడం గమనార్హం.

నాడు అతిథి మర్యాదలు..: డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం బాగా జరిగిందని ఏపీపీఎస్సీ కార్యాలయ ప్రాంగణంలోనే పలువురు అభ్యర్థులు అప్పట్లో ప్రకటించారు. నాడు సానుకూలంగా మాట్లాడిన వారిలో పలువురి పేర్లు మాన్యువల్‌ మూల్యాంకన ఫలితాల జాబితాలో గల్లంతయ్యాయి. డిజిటల్‌ విధానంలో మాదిరిగానే మాన్యువల్‌లోనూ మౌఖిక పరీక్షలకు ఎంపికవుతామని భావించిన వీరిని తాజా ఫలితాలు తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. వీరిలో కొందరు అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారులను కలుసుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి సోమవారం కార్యాలయం దగ్గరకు వచ్చారు. ఐదుగురిని మాత్రమే కార్యాలయంలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. తమ వినతిపత్రాన్ని పీఆర్వో తీసుకున్నారని, సీనియర్‌ అధికారులను కలుసుకోనీయలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

అభ్యర్థులు వెలిబుచ్చిన సందేహాలు

పలువురు గ్రూపు-1 అభ్యర్థులు విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ తీరుపై పలు అనుమానాలను వెలిబుచ్చారు.
* విశాఖపట్నంలో తొలి జాబితాలో కంటే మలి జాబితాలో ఎక్కువ మంది అభ్యర్థులు మౌఖిక పరీక్షలకు ఎంపికయ్యారు. ఇదెలా సాధ్యం?
* మూల్యాంకన విధానం, జవాబుపత్రాల ‘కీ’... డిజిటల్‌కు, మాన్యువల్‌కు ఒకటే. ప్రశ్నలు, సమాధానాలు, చేతిరాతలుమారలేదు. డిజిటల్‌... మాన్యువల్‌ మూ ల్యాంకనం మధ్య తేడా 20% మించి ఉండకూడదు. ఫలితాల మధ్య ఎక్కువ వ్యత్యాసం ఎందుకొచ్చింది?
* అప్పుడు, ఇప్పుడు అర్హత కలిగిన సబ్జెక్టు నిపుణుల ద్వారానే మూల్యాంకనం చేయించినా.. ఫలితాల్లో ఎందుకు భారీ తేడా ఎలా వచ్చింది?
* యూపీపీఎస్సీలో ఏ మాధ్యమానికి చెందిన జవాబు పత్రాలను ఆ మాధ్యమం సబ్జెక్టు నిపుణులతో దిద్దిస్తారు. ఇక్కడ తెలుగు మాధ్యమం పత్రాలను ఎవరు దిద్దారు?
* ఈసారి ఫలితాలువెల్లడించేందుకు ఏపీపీఎస్సీ ఎక్కువ సమయం తీసుకుంది. మూడు నెలల్లో ఫలితాలివ్వాలని హైకోర్టు ఆదేశించగా ఏపీపీఎస్సీకి 8 నెలలు పట్టింది. ఇంత సమయం ఎందుకు తీసుకున్నారు?
* మేము స్వయంగా కార్యాలయానికి వస్తే... మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు?

క్రీడా కోటాలోనూ తగ్గింపు:

"డిజిటల్‌ విధానంలో క్రీడల కోటాలో మౌఖిక పరీక్షకు ఎంపికచేసిన వారి సంఖ్య 75. మాన్యువల్‌ విధానంలో 48 మందినే మౌఖిక పరీక్షకు ఎంపికచేశారు. జనరల్‌ కోటాలో ఉన్న ముగ్గుర్ని స్పోర్ట్స్‌ కోటాలో చూపించారు. స్పోర్ట్స్‌ కోటాలో అభ్యర్థులు తగ్గిపోవడమేమిటి? దీకి బాధ్యులెవరు? మేం చేసిన తప్పేంటి? అధికారులే సమాధానం చెప్పాలి." - అనురాధ

మా జీవితాలతో ఆటలొద్దు:

"డిజిటల్‌ మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలకు అర్హత కల్పిస్తూ లిఖితపూర్వక ధ్రువపత్రాన్ని ఇచ్చారు. రెండో జాబితాలో నేను ఎంపిక కాలేదు. అంటే...డిజిటల్‌ మూల్యాంకనం బాగా లేదా? మాన్యువల్‌ విధానం బాగా లేదా? మా జీవితాలతో ఆడుకోవడం తగదు." - శ్రీనివాసులు

తెలుగులో రాయడం తప్పా:

మలివిడత జాబితాలో తెలుగు మాధ్యమం అభ్యర్థులు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. మాతృభాషలో జవాబులు రాయడం మా తప్పా? అసలు మా జవాబుపత్రాలను ఏ మాధ్యమం వారు దిద్దారు? శ్రీకాకుళం జిల్లాలో 2021 జాబితా ప్రకారం 23 మంది మౌఖిక పరీక్షలకు ఎంపికైతే.. ఈ సారి తొమ్మిది మందే ఉన్నారు." - చంద్రమోహన్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.