ETV Bharat / city

CAG reports: ఏపీని ముంచబోతున్న అప్పులు.. కాగ్ నివేదికల్లో వాస్తవాలు - ఏపీ అప్పులపై కాగ్ సమాచారం

CAG reports on debits : "సాధారణంగా రాష్ట్రం తీసుకున్న అప్పులను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలి. రుణాల బకాయిల మీద వడ్డీలు చెల్లించేందుకు, రోజు గడిచేందుకు అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఏపీలో రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారు. ఆస్తులు సృష్టించేందుకు కాకుండా.. రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తున్నారు. రాష్ట్రానికి రుణాలను భరించే సామర్థ్యం లేదు “ -కాగ్‌

ఏపీ ప్రభుత్వంపై కాగ్ నివేదిక
CAG has released alarming reports
author img

By

Published : Sep 22, 2022, 8:32 AM IST

CAG has released alarming reports: "మేం చేస్తున్న అప్పులు తక్కువే. ఆర్థికవ్యవస్థను చక్కగా నిర్వహిస్తున్నాం. మేం ఎక్కువ అప్పులు చేస్తున్నామంటూ అనవసరంగా మాపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ మొన్నే సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ఇంతలోనే అందుకు విరుద్ధంగా ఉన్నకంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ నివేదికను ప్రభుత్వం శాసనసభకు సమర్పించింది.. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు కాగ్‌ తేల్చిచెప్పింది.. రుణాలను భరించే సామర్థ్యం రాష్ట్రానికి లేదని స్పష్టం చేసింది. పాత రుణాలు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు వెల్లడించింది .

CAG reports
G.S.D.P.లో రుణాల వాటా 44.04 శాతంకు పెరుగుదల

2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్​ఆర్​బీఎం చట్టాన్ని అతిక్రమించారని. తెలిపింది. జీఎస్​డీపీలో రుణాల వాటా 44.04 శాతానికి పెరిగినట్లు కాగ్‌ పేర్కొంది "సాధారణంగా రాష్ట్రం తీసుకున్న అప్పులను ఆస్తుల సృష్టికి, అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలి. రుణాల బకాయిల మీద వడ్డీలు చెల్లించేందుకు, రోజు గడిచేందుకు అప్పు తీసుకోవడం ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది. ఏపీలో రుణం తీసుకుని పాత అప్పులు తీరుస్తున్నారు. ఆస్తులు సృష్టించేందుకు కాకుండా.. రెవెన్యూ ఖర్చులకు వినియోగిస్తున్నారు. రాష్ట్రానికి రుణాలను భరించే సామర్థ్యం లేదు'' అంటూ కాగ్‌ రాష్ట్ర ప్రభుత్వ తీరును తేటతెల్లం చేసింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి మొత్తం బకాయిలు జీఎస్‌డీపీలో 35శాతానికి మించకూడదని ఎఫ్​ఆర్​బీఎం చట్టం చెబుతోందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది . 2021 మార్చి 31కి ఈ రుణాలు 35.30 శాతం ఉండటం పరిమితులను దాటినట్లయింద వెల్లడించింది . బడ్జెట్‌లో చూపకుండా బయటి నుంచి తీసుకునే రుణాలు కలిపితే జీఎస్​డీపీలో రుణాల వాటా 44.04 శాతంకు పెరుగుతోంది అని స్పష్టం చేసింది. 2021 మార్చి 31 నాటికి ఉన్న పరిస్థితుల ప్రకారం రాబోయే ఏడేళ్లలో 45.74శాతం అంటే లక్షా 23 వేల 640 కోట్ల రూపాయల అప్పులు తీర్చాలని కుండబద్దలు కొట్టింది. అందుకు సరైన వ్యూహం లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తగ్గిపోతాయనీ హెచ్చరించింది .

ఒక మనిషి 2018-19 నాటికి 50 వేల 156.80 రూపాయలు బకాయి పడి ఉంటే 2021 మార్చి నెలాఖరు నాటికి అది 67 వేల 484.88 రూపాయలకు చేరినట్లు కాగ్‌ తెలిపింది. ఏపీలో అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని తేల్చింది. రాబోయే సంవత్సరాలకు రుణభారాన్ని పెంచుతున్నారని స్పష్టంగా కాగ్‌ పేర్కొంది. రెవెన్యూ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను వినియోగిస్తోందని కాగ్ తెలిపింది.

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల వాటా 44

తీసుకున్న రుణాల్లో ఏకంగా 81శాతం రెవెన్యూ ఖర్చుల కోసమే వినియోగిస్తున్నారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఆస్తుల కల్పనకు ఆటంకం కలుగుతోందని కాగ్‌ అభిప్రాయపడింది. బడ్జెట్‌లో చూపకుండా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుంటున్నారని కాగ్ వెల్లడించింది . దీంతో మొత్తం రుణాలను, ద్రవ్యలోటునూ తగ్గించి చూపుతున్నారని తప్పుబట్టింది. దీనివల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రుణాల వాటా ఏకంగా 44 శాతానికి పెరిగిందని కాగ్‌ తేల్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును భర్తీ చేసేందుకు 7 వేల 268 కోట్ల నికర వసూళ్లను వినియోగించాల్సి వచ్చిందని కాగ్‌ పేర్కొంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌ వల్ల రుణాలు పెరిగాయని పేర్కొందని.. అయితే ఆరోగ్యరంగంలో ఏపీ కేటాయింపులు తక్కువగానే ఉన్నాయని కాగ్‌ విశ్లేషించింది. ఇతర రాష్ట్రాలు ఆరోగ్యరంగంపై 6.74 శాతం నిధులు వెచ్చిస్తుంటే ఏపీ మాత్రం 5.49 శాతమే ఖర్చు చేసినట్లు తెలిపింది.SPOT

ఆంధ్రప్రదేశ్‌లో రోజు వారీ కార్యకలాపాల కోసం ఎప్పటికప్పుడు చేబదుళ్లు
వివిధ ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ పూచీకత్తు మీద రుణాలు తీసుకుంటున్నాయని... వీటిని బడ్జెట్‌లో చూపడం లేదని కాగ్‌ తెలిపింది. ప్రజారుణంలోకి లేదా ద్రవ్యలోటులోకి వీటిని తీసుకోకపోవడం ద్వారా ఆ రెండింటినీ తక్కువ చేసి చూపిస్తున్నారని కాగ్‌ విశ్లేషించింది. ఆంధ్రప్రదేశ్‌లో రోజు వారీ కార్యకలాపాల కోసం ఎప్పటికప్పుడు రాష్ట్రం చేబదుళ్లు తీసుకోవలసి వస్తోందని కాగ్‌ పేర్కొంది . ఆ రూపంలో తీసుకున్న మొత్తాలు 2020-21లో ఏకంగా లక్షా 4 వేల 539 కోట్లు రూపాయలుగా ఉన్నట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి 73.16 శాతం మేర పెరిగాయని కాగ్‌ తెలిపింది.

2019-20 నాటికి అవి 3 లక్షల 48 వేల 246 కోట్ల
2016 నాటికి ఉన్న రుణ బకాయిల కన్నా 2021 నాటికి ఉన్న బకాయిల మొత్తం ఎక్కువ అని కాగ్‌ తెలిపింది. ఈ బకాయిల పెరుగుదల శాతం గణనీయంగా పెరుగుతూ వచ్చిందని పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రుణ బకాయిలు 2 లక్షల 13 వందల 14 కోట్లు ఉంటే 2019-20 నాటికి అవి 3 లక్షల 48 వేల 246 కోట్ల రూపాయలకు చేరాయని తెలిపింది. అంటే రుణ బకాయిల్లో పెరుగుదల 72.99 శాతం ఉందని కాగ్‌ పేర్కొంది. రెవెన్యూ లోటు ఐదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరిందని.. 2020-21లో అత్యధికంగా 35 వేల 541 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు ఏర్పడిందని కాగ్‌ స్పష్టం చేసింది. ఏపీలో 2020-21లో అత్యంత తక్కువ జీఎస్‌డీపీ నమోదైనట్లు తెలిపింది. రాష్ట్రం ఏటా 10శాతంకు పైగా వృద్ధిరేటు సాధిస్తుండగా.. గత ఆర్థిక సంవత్సరంలో అది 1.58శాతానికి పడిపోయినట్లు పేర్కొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.