మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రేపటి నుంచి తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అన్‌లాక్ 4.0లో భాగంగా ప్రభుత్వం ప్రజా రవాణాకు అనుమతి తరువాత ఇప్పటికే జిల్లాలకు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు మాత్రం నడవడం లేదు. తాజాగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో మహారాష్ట్ర, కర్ణాటకకు ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవటం వల్ల ఆ రాష్ట్రానికి బస్సులు నడిపించడం లేదని అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి