దాడి చేయించిందే కాక.. వైకాపా నేత, ఎమ్మెల్యే పిన్నెల్లి అబద్ధాలు చెబుతున్నారని బుద్దా వెంకన్న ఆరోపించారు. తెదేపా నేతలపై పథకం ప్రకారమే దాడులు చేస్తున్నారని విమర్శించారు. పిన్నెల్లి చెప్పింది నిజమే అయితే జగన్‌పై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తమపై దాడి గురించి చెప్పిందంతా నిజమని ప్రమాణం చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులకు తావులేదని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై విశాఖలో, లోకేశ్‌పై సీతానగరంలో దాడి చేశారని గుర్తు చేశారు. 20 కిలోమీటర్లు వెంబడించి భయాందోళనకు గురిచేశారని వాపోయారు. క్రమశిక్షణ, నిజాయతీ, ప్రజాసేవపై తెదేపా నేతలకు తరచుగా శిక్షణ ఉంటుందని... వైకాపా నేతలకు జరిగే తరగతులు మాత్రం వేరని బుద్ధా వెంకన్న మండిపడ్డారు.
ఇదీ చదవండి: