BJP SATYAKUMAR: రాష్ట్రానికి ఎవరు ఏం చేశారో తేల్చేందుకు చర్చకు రావాలని భాజపా నేత సత్యకుమార్ అధికార పార్టీకి సవాల్ విసిరారు. రాయలసీమ జిల్లాల్లోని ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్డు వేశామన్నారు. భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే నైతిక హక్కు వైకాపా నేతలకు లేదన్నారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి విమర్శలను తిప్పికొట్టిన సత్యకుమార్.. పార్టీలు మారే సంస్కృతి తమకు లేదన్నారు.
SOMU VEERRAJU: కేంద్రం నిధులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పనులు చేపట్టే పరిస్థితి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కావాలనే రాజధాని నిర్మాణం ఆలస్యం చేస్తున్నారని ఆరోపించిన సోము వీర్రాజు.. వైకాపా ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
ఇవీ చదవండి: