ముఖ్యమంత్రి జగన్పై భాజపా నేత సునీల్ దియోధర్ విమర్శలు గుప్పించారు. నంద్యాల ఉపఎన్నికలో తెదేపా గెలిచినప్పుడు జగన్ ఏమన్నారో గుర్తు తెచ్చుకోవాలన్నారు. గతాన్ని మర్చిపోకూడదని హితవు పలికారు. వైకాపా, తెదేపాలు అధికార, ధన బలాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని.. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని ట్వీట్ చేశారు. మిమ్మల్ని సాగనంపే రోజు వస్తుందని.. భవిష్యత్తులో ప్రజలు భాజపా-జనసేనకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు జగన్ మాట్లాడిన ఓ వీడియోనూ పోస్ట్ చేశారు.
ఇదీ చదవండి
చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని ఆదేశం