కరోనాతో ఇబ్బందులున్నా.. దేశ ప్రజలను ఆదుకోవడానికి ప్రధాని మోదీ ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారని భాజపా నేత రావెల కిశోర్‌బాబు అన్నారు. గుంటూరులో మాట్లాడిన ఆయన.. ఈ ప్యాకేజీ పేదలు, బడుగు, బలహీన వర్గాల వారికి చాలా మేలు జరుగుతుందని తెలిపారు. పారిశ్రామిక రంగాలకు సైతం చేయూతనిచ్చేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన, ఉజ్వల పథకం, జన్‌ధన్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ప్రధాని మోదీ అదుకుంటున్నారని వివరించారు.
ఇదీ చూడండి..