అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా కొత్త యూనిట్ల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారుల స్థితిగతులు పరిగణలోకి తీసుకుని యూనిట్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. ప్రతి నెల తొలి వారంలో జిల్లాస్థాయిలో ఈడీ సమావేశం జరపాలని ఆదేశించారు. వ్వవసాయ, రవాణా, కంప్యూటర్ విడి పరికరాల విక్రయంపై దృష్టి సారించాలని సూచించారు.
ఇదీ చదవండి: పోలవరం కాంట్రాక్టుపై ఏం జరగనుంది..?