ETV Bharat / city

Endowment: పదోన్నతులపై బేరాలు.. బెదిరింపులు - పదోన్నతులపై బేరాలు

Endowment: కమిషనరేట్‌లో ఓ అధికారి.. ఆలయాల ఉద్యోగుల సర్వీసు అంశాల రూటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. వివిధ ఆలయాల్లో రికార్డ్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పిస్తున్నామని, ఫైల్‌ సిద్ధమైందని ఆయన ఫోన్‌చేసి ఆయా ఉద్యోగులతో మాట్లాడారు. తాజాగా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు బేరాలు ఆడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగులతో ఆ అధికారి మాట్లాడిన ఫోన్‌ సంభాషణల ఆడియోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Endowment
పదోన్నతులపై బేరాలు.. బెదిరింపులు
author img

By

Published : May 17, 2022, 8:28 AM IST

Endowment: దేవాదాయశాఖ కమిషనరేట్‌లోని ఓ అధికారి తీరు ఎప్పుడూ వివాదాస్పదమే. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి. తాజాగా కొందరికి పదోన్నతులు కల్పించేందుకు బేరాలు ఆడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగులతో ఆ అధికారి మాట్లాడిన ఫోన్‌ సంభాషణల ఆడియోలు ఇపుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో కొన్ని పాతవికాగా, మరికొన్ని కొద్దిరోజుల కిందటివేనని తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే.. కమిషనరేట్‌లో ఓ అధికారి.. ఆలయాల ఉద్యోగుల సర్వీసు అంశాల రూటింగ్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. వివిధ ఆలయాల్లో రికార్డ్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పిస్తున్నామని, ఫైల్‌ సిద్ధమైందని ఆయన ఫోన్‌చేసి ఆయా ఉద్యోగులతో మాట్లాడారు. తనను కలవాలని, చేయి తడపాలంటూ పరోక్షంగా ప్రస్తావించారు. ఇలా కొంత ముట్టజెప్పిన వారికి తర్వాత పదోన్నతులు రాలేదు. దీనిపై వాళ్లు ప్రశ్నించడంతో.. ఆ అధికారే బాధితులపై విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. డబ్బులిచ్చిన బాధిత ఉద్యోగులకు పోలీసులు ఫోన్‌చేసి స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేయడం గమనార్హం.

* ఇటీవల కొందరు ఈవోలకు సహాయ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించే దస్త్రాన్నీ ఆ అధికారి సిద్ధం చేశారు. పదోన్నతి పొందేందుకు అర్హత ఉన్నవారికి స్వయంగా ఫోన్‌చేసి.. తనను కలవాలని, రాత్రి ఫోన్‌ చేయాలంటూ మాట్లాడిన ఆడియో టేపులు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి.ఈ ఫోన్‌ సంభాషణలు తాజాగా వెలుగులోకి రావడం వెనుక.. ఉప కమిషనర్ల(డీసీలు) పదోన్నతుల అంశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పదోన్నతుల కోసం కూడా వివాదాస్పద అధికారి దస్త్రాన్ని సిద్ధం చేసినట్లు తెలిసింది. కమిషనరేట్‌ అధికారుల కోటాలో ఆయన పేరు కూడా ఉంది. దీంతో ఆయనకు చెందిన పాత ఆడియోలు బయటకువచ్చాయనే వాదన వినిపిస్తోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.