లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. 2005 నుంచి 2009 లోపు న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకున్న వారిలో రోజువారి నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నవారికి రెండో దశలో ఆర్థిక సాయం చేయాలని ఏపీ న్యాయవాదుల మండలి నిర్ణయించింది. అర్హులైన న్యాయవాదులు ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తెలిపారు. మొదటి విడతలో ఆర్థిక సాయంగా 2010 నుండి ఫిబ్రవరి 2020 వరకు న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న 2743 మందికి రూ.3,500 చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. లాక్డౌన్ కాలంలో న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు ఇంటి వద్దనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి : కరోనాపై అదిరిపోయే కార్టూన్స్....