ETV Bharat / city

తెలంగాణ: 'అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్​ స్పందించాలి' - బండి సంజయ్ తాజా వార్తలు

పీవీ, ఎన్టీఆర్ సమాధులు కూల్చేయాలన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై తెరాస ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్​ వెంటనే స్పందించి.. వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు.

bandi sanjay
బండి సంజయ్, తెలంగాణ భాజపా అధ్యక్షుడు
author img

By

Published : Nov 26, 2020, 1:56 PM IST

బండి సంజయ్

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పీవీ ఘాట్​, ఎన్టీఆర్​ ఘాట్​ కూల్చివేయాలంటూ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వారు తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తులని కొనియాడారు. ఓ వర్గం ఓట్లు పోతాయని కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్, పీవీ కాలి గోటి కిందికి మజ్లిస్ పార్టీ సరిపోదన్నారు.

"తెలుగుజాతి గౌరవానికి పీవీ, ఎన్టీఆర్ ప్రతీకలు. వారు ప్రపంచ వ్యాప్తంగా అందరి మన్ననలు పొందారు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలించారనే మజ్లిస్ వ్యతిరేకిస్తోంది. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చేవేయాలని అంటుంటే.. కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు. పీవీ జయంతి ఉత్సవాలు జరపడం కాదు.. గౌరవాన్ని కూడా కాపాడాలి. చిత్తశుద్ధి ఉంటే... ఘాట్‌ను కూల్చివేయాలన్న వారిని అరెస్టు చేయాలి. కేసీఆర్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. శాంతియుత వాతావరణంలో గ్రేటర్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. శాంతి భద్రతల పేరుతో సీఎం కేసీఆర్ నాటకాలాడుతున్నారు. కుట్రలపై పక్కా సమాచారం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెరాస కనుమరుగు కాబోతోంది. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతాం." - బండి సంజయ్

కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేడ్కర్​ విగ్రహానికి ఒక్క రోజు కూడా నివాళి అర్పించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆక్షేపించారు. రాజ్యాంగ దినోత్సవం రోజునా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించలేదని అన్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సంజయ్‌ నివాళులర్పించారు. నగరంలో 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. భాజపా జీహెచ్‌ఎంసీ మేయర్ స్థానాన్ని దక్కించుకున్నాక.. దేశంలోనే అతిపెద్ద అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

విశాఖలో వైకాపా నాయకుల మధ్య ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.