ETV Bharat / city

nano urea: నానో యురియావైపు మెుగ్గుచూపుతున్న రైతులు.. పెరుగుతున్న ఆదరణ

Awareness about nano urea: నానో సాంకేతికత ఎరువుల తయారీలో సరికొత్త విప్లవానికి నాంది పలికింది. పంటల సాగులో కీలకమైన యూరియా తయారీలో ఇపుడు నానో టెక్నాలజీ నూతన ఉత్పత్తిని ఆవిష్కరించింది. బస్తాలో పట్టే ఎరువుని కేవలం అరచేతిలో పట్టుకునే వెళ్లే బాటిల్లో నిక్షిప్తం చేసి ఇఫ్కో సంస్థ రైతుల చెంతకు చేర్చింది. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటి. దీని వల్ల అదనంగా వచ్చే ప్రయోజనాలేంటి. వీటి ఫలితాలెలా ఉన్నాయో తెలుసుకుందాం.

nano urea
నానో యూరియా
author img

By

Published : Sep 13, 2022, 11:40 AM IST

Adoption of nano urea: నానో యూరియాకు ఆదరణ పెరుగుతోంది. అమ్మకాలు గణనీయంగా జరుగుతున్నాయి. యూరియాను గుళికల రూపంలో నుంచి ద్రవరూపంలోకి మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై జరిగిన కసరత్తు తర్వాత అందుబాటులోకి వచ్చింది నానో యూరియా. ఇండియన్‌ ఫార్మర్స్‌ ఫర్టిలైజర్‌ కోఆపరేటివ్‌(ఇఫ్‌కో) సంస్థ నానో టెక్నాలజీ ద్వారా ప్రపంచంలోనే తొలిసారిగా దేశంలో నానోయూరియా తయారీని ప్రారంభించింది. అన్ని పరీక్షలను పూర్తిచేసుకుని ఆగస్టు 2021 నుంచి మార్కెటింగ్‌ చేస్తోంది. అర లీటరు(500ఎంఎల్‌) బాటిళ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.

రూ.240 నానో యురియా. ఇది 45కిలోల యూరియా బస్తాకు సమానం:

దీని ధర రూ.240. ఇది 45కిలోల యూరియా బస్తాకు సమానం. 45 కిలోల బస్తా తయారీకి రూ.1000లుపైగా ఖర్చవుతుండగా రూ.266.50కు రైతులకు విక్రయించి మిగిలిన మొత్తాన్ని కేంద్రం రాయితీగా అందిస్తోంది. ఈ నేపథ్యంలో యూరియా తయారీలో స్వయంసమృద్ధి సాధించేందుకు నానోయూరియాను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రాయితీ భారాన్ని తగ్గించుకోవడంతోపాటు రూ.వేల కోట్ల విదేశీమారక ద్రవ్యాన్ని కూడా ఆదా చేయాలన్నది లక్ష్యం.

ఏటా 90 లక్షల టన్నుల దిగుమతి:

ప్రస్తుతం దేశంలో యూరియా ఉత్పత్తి 260 లక్షల టన్నులు. ఇది చాలక దాదాపు 90 లక్షల టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2.15 కోట్ల నానో యూరియా సీసాలు విక్రయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 10వ తేదీ నాటికి 1.12 కోట్ల సీసాలు అమ్ముడయ్యాయి. 2022-23 సంవత్సరంలో నానో యూరియా మొత్తం 6 కోట్ల బాటిళ్లు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. రోజూ 2 లక్షల బాటిళ్ల ఉత్పత్తి సామర్థ్యంతో గుజరాత్‌లోని కల్లోల్‌ యూనిట్‌లో తయారీ మొదలవగా అయ్‌నోలా, పుల్పూర్‌, బెంగళూరు, పారాదీప్‌, కాండ్లా, దేవ్‌ఘర్‌, గువహటిలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. నానో యూరియాకు రైతుల ఆదరణ ఇలాగే ఉంటే 2025 చివరి నాటికి విదేశీ యూరియా అవసరం ఉండదని కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ మంత్రి మాన్‌సుఖ్‌ మాండవీయా ఇటీవల ప్రకటించారు.

ప్రయోజనాలెన్నో..

* నానోయూరియా రవాణా, నిల్వ సులభం.

* తయారీ తేదీ నుంచి ఏడాది పని చేస్తుంది.

* పంట ఉత్పాదకతను 8శాతం పెంచుతుంది.

* కొంత కాలవ్యవధిలో గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ ఉద్గారాలను తగ్గించవచ్చు.

* నేరుగా ఆకులపై చల్లడం వల్ల వృథా తక్కువ.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.