ETV Bharat / city

ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం... రేపటితో ముగుస్తున్న తుది గడువు - autodrivers_financial_assistence_tommorow_last date_for scheme

ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన పథకానికి ప్రభుత్వ నిబంధనలే ఆటంకంగా మారుతున్నాయి. కేవలం సొంత ఆటో ఉన్న డ్రైవర్లకు మాత్రమే పథకం వర్తింపజేయటంతో దరఖాస్తుదారుల సంఖ్య సగానికిపైగా పడిపోయింది. రేపటితో దరఖాస్తు గడువు ముగియనుండగా... సర్వర్ సమస్యలూ ఇబ్బంది పెడుతున్నాయి.

ఆటోడ్రైవర్లకు 10వేల ఆర్థికసాయం... రేపటితో ముగుస్తున్నతుదిగడువు
author img

By

Published : Sep 24, 2019, 5:14 AM IST

Updated : Sep 24, 2019, 7:22 AM IST

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు చేయూతను అందించే లక్ష్యంతో ఏటా 10వేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని ప్రభత్వం నిర్ణయించింది. లబ్దిదారుల ఎంపిక కోసం రెండు వారాలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయాలతో పాటు మీసేవా కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసే అవకాశం కల్పించారు. రేపటితో దరఖాస్తుల గడువు ముగియనుంది.
పథకానికి చాలా మంది దూరం....
రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ అయిన వాహనాలు 6లక్షల 63వేలు ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతుండగా... ఇప్పటి వరకూ కేవలం లక్షా 43వేలు ధరఖాస్తులే రావటం గమనార్హం. దీనికి కారణం ప్రభుత్వ నిబంధనలే కారణంగా కనిపిస్తున్నాయి. సొంత ఆటో ఉన్నా రిజిస్ట్రేషన్ పాత యజమాని పేరిట ఉండటంతో చాలామంది పథకానికి దూరమైనట్లు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు.

ఆటోడ్రైవర్లకు ఆర్థికసాయం... రేపటితో ముగుస్తున్నతుది గడువు

రోజు వారి ఆదాయం కోల్పోతున్నాం....
చాలామంది ఆటోలు అద్దెకు తీసుకుని నడుపుతుంటారు . నిబంధనల ప్రకారం ఆటోలు అద్దెకు తీసుకుని నడిపేవారికి లబ్ది చేకూరదు. ఇక నాలుగైదు ఆటోలు ఉన్నవారికి సైతం ఒక్క ఆటోకు మాత్రమే 10వేల ఆర్థిక సాయం అందుతుంది. ఈ కారణంగా దరఖాస్తుల సంఖ్య తగ్గినట్లు చెబుతున్నారు. దీనికి తోడు దరఖాస్తు చేసేందుకు వచ్చేవారిని సర్వర్ సమస్యలు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు. రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావటం వల్ల ... రోజువారీ ఆదాయం కోల్పోతున్నట్లు డ్రైవర్లు వాపోతున్నారు
అక్టోబర్ 4న....
దరఖాస్తులన్నింటినీ గ్రామ, వార్డు వాలంటీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఆ తర్వాత వాటిని ఎంపీడీవోలకు, బిల్ కలెక్టర్లకు పంపిస్తారు. వారి నుంచి కలెక్టర్​కు లేదా కమిషనర్ ఆమోదం పొందిన తర్వాత అర్హులైన వారి జాబితా ప్రభుత్వానికి చేరుతుంది. ఈ ప్రక్రియ ఈ నెలఖారుకల్లా పూర్తి చేసి అక్టోబర్ 4న డ్రైవర్లకు ఆర్థికసాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు.

ఇవీ చూడండి-విజయగాథకు చిహ్నం.. హైదరాబాద్ హైటెక్ సిటీ: చంద్రబాబు

Intro:JK_AP_NLR_05_23_HARTICULTER_NURSARI_RAJA_AVB_AP10134
Anc
ప్రభుత్వం రైతులకు నాణ్యమైన మామిడి ,నిమ్మ మొక్కల అందించేందుకు నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గుడిపల్లి పాడు లో నర్సరీలు ఏర్పాటు చేసిందని ఉద్యాన అధికారి రమేష్ తెలిపారు. ఈ నర్సరీలు ప్రస్తుతం 50 వేల మామిడి మొక్కలు పదివేల nimma మొక్కలు రైతులకు ఇచ్చేందుకు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలియజేశారు. రైతులకు నాణ్యమైన మొక్కలు అందించేందుకు ఈ నర్సరీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతులు బయట మార్కెట్లో కొని మోసపోకుండా ఈ నర్సరీలో కొనుగోలు చేస్తే మంచి మొక్కలు వస్తాయన్నారు. ఈ నర్సరీలో మామిడి మొక్క 30 రూపాయలు నిమ్మ మొక్క 15 రూపాయలకు రైతులకు ఇస్తామని ఆయన తెలిపారు. బయట మార్కెట్లో మామిడి 70 నుంచి 90 రూపాయలు నిమ్మ 30 నుంచి 40 రూపాయల వరకు అమ్ముతున్నారని, రైతులు ప్రభుత్వం నర్సరీలో మొక్కలు కొనుగోలు చేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బైట్, రమేష్ ,ఉద్యాన అధికారి నెల్లూరు జిల్లా

Body:ఉద్యాన నర్సరీ

Conclusion:రాజా నెల్లూరు 9394450293
Last Updated : Sep 24, 2019, 7:22 AM IST

For All Latest Updates

TAGGED:

auto drivers
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.