విశాఖలో తెదేపా కార్పొరేటర్ అభ్యర్ధిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. 56వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శరగడం రాజశేఖర్‌పై రైల్వే డీజిల్ లోకో షెడ్ సమీపంలో ఉన్న రైలు పట్టాలపై నుంచి రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో అతని తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చాకలిపేటలో ఓ సమావేశానికి ద్విచక్రవాహనంపై బంధువు అవినాష్‌తో వెళ్తుండగా ఈ దాడి జరిగింది.
ఇదీ చదవండి