ETV Bharat / city

సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌.. ప్రారంభానికి సన్నాహాలు - ap cm jagan

గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

village secretariats
village secretariats
author img

By

Published : Jul 13, 2020, 6:33 AM IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15, 16 తేదీల్లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రయోగాత్మకంగా చేపట్టే ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కాజ సచివాలయం ఎంపికైంది. ఇక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రంలోని మిగిలిన చోట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. గత కొద్ది రోజులుగా సచివాలయాల్లో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎవరు చేయాలనే అంశంపై ఇటు రిజిస్ట్రేషన్‌, అటు ప్రభుత్వవర్గాల్లో అయోమయం నెలకొంది.

తాజాగా దీనిపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మక కార్యక్రమం కావడంతో సబ్‌రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలోనే సచివాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. దస్తావేజుకు సంబంధించిన చెక్‌స్లిప్‌లు కొట్టడానికి, మార్కెట్‌ ధరలు పక్కాగా నమోదు చేశారా? లేదా? అనేవి పరిశీలించే పనులకు మాత్రం సచివాలయాల్లోని ఇతర సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని సూచించింది. ఈ మేరకు అవసరమైన నెట్‌వర్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:

ఈటీవీ - భారత్ ప్రత్యేక చర్చ: భారతీయ రైల్వేల ప్రైవేటీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.