ETV Bharat / city

పరుగుల్లేని ప్రగతి రథ చక్రం... నష్టాల బాటలోనే పయనం...

కరోనా కారణంగా ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోంది. లాక్​డౌన్​తో రెండు నెలల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితమవగా.. ప్రస్తుతం కొన్ని బస్సులు తిరుగుతున్నా... సంస్థకు నష్టాలే మిగిలుతున్నాయి. రోజువారీ నిర్వహణ కూడా రాని పరిస్థితి నెలకొంది. పైగా రోజురోజుకూ పెరుగుతున్న డీజిల్ రేట్లు ప్రగతి రథ చక్రానికి బ్రేకులు వేస్తున్నాయి. ఆర్టీసీని లాభాల బాటలో నడిపడం అటుంచి... నష్టం రాకుండా నడపేందుకు ఏం చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు.

author img

By

Published : Jun 26, 2020, 6:11 PM IST

Updated : Jun 26, 2020, 7:38 PM IST

పరుగుల్లేని ప్రగతి రథ చక్రం
పరుగుల్లేని ప్రగతి రథ చక్రం

ఏపీఎస్​ఆర్టీసీకి 11వేలకు పైగా బస్సులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో రోజుకు 43 లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణించి... 70 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తుంది ఆర్టీసీ. రోజుకు రూ.13 కోట్లు రాబడి వచ్చినా... లెక్కలేస్తే చివరకు నష్టమే మిగిలేది. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా మరిన్ని చిక్కులు తెచ్చింది. లాక్​డౌన్​ వల్ల మార్చి 22 నుంచి రెండు నెలల పాటు బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఆదాయం లేక ఆర్టీసీ ఖజానా ఖాళీ అయింది. అప్పులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్యాలయాల నిర్వహణ కూడా భారమైంది.

పరుగుల్లేని ప్రగతి రథ చక్రం... నష్టాల బాటలోనే పయనం...

సగం సీట్లతో.. పరిమిత రూట్లలలో..

రెండు నెలల అనంతరం ఎట్టకేలకు మే 21న బస్సులు తిరిగి రోడ్డెక్కాయి. పూర్వపు పరిస్థితి వస్తుందని ఆశించిన యాజమాన్యానికి మళ్లీ నిరాశే మిగిలింది. కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవడంతో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో బస్సులు నడపాల్సివచ్చింది. బస్సుల్లో భౌతిక దూరం పాటించాల్సిందేనన్న ఆదేశాలతో సీట్ల సంఖ్యను సగానికి సగం తగ్గించింది. పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్ల సంఖ్యను తగ్గించడం సహా కొన్నింటిలో అమరికను మార్చారు. తొలుత 1500 సర్వీసులను రోడ్డెక్కగా... క్రమంగా పెంచుతూ ప్రస్తుతం 3400 వరకు సర్వీసులు నడుపుతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడుపుతున్నా..వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో బస్సుల్లో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపడంలేదు. దీంతో చాలా బస్సులు ఖాళీగా నడుస్తున్నాయి.

48 శాతానికి పడిపోయిన ఆక్యుపెన్సీ

సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో 72 శాతం పైగానే ఓఆర్(ఆక్యుపెన్సీ రేట్) వస్తుంటుంది. కరోనా కారణంగా సీట్లు సగానికి తగ్గగా... వాటిలోనూ 48 శాతానికి ఓఆర్ మించడం లేదు. దీంతో ప్రతి సర్వీసుకూ భారీగా నష్టం మూటగట్టుకోవాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో సంస్థకు రోజుకు 13 కోట్లు వరకు రాబడి వస్తుండగా ఇప్పుడు కేవలం రెండున్నర కోట్లు మాత్రమే ఆదాయం వస్తుందన్నారు. లాక్​డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.1100 కోట్ల పైగా నష్టపోయినట్లు అధికారులు లెక్కతేల్చారు.

నష్టాల ఊబిలో ప్రగతి చక్రం

నష్టాలతో నెట్టుకొస్తున్న పరిస్థితుల్లో రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్థను ఆర్థికంగా మరింత దెబ్బతిస్తున్నాయి. ఇటీవల డీజిల్ ధర లీటరుకు 9 రూపాయల మేర పెరిగింది. ఆర్టీసీకి బస్సు ఓ కిలోమీటరు నడిపేందుకు రూ.15.20పై వరకు ఖర్చవుతుంది. ధరల పెంపుతో ప్రతి కిలోమీటరుకు రూ.1.80 పైసలు అదనపు భారం పెరిగింది. ప్రస్తుతం పరిమితంగా 3400 వరకు సర్వీసులు, సగటున 11 లక్షల కిలోమీటర్లు నడుపుతున్నారు. దీంతో దాదాపు రోజుకు రూ.20 లక్షల నష్టం వాటిల్లుతోంది. పూర్తి స్థాయిలో బస్సు సర్వీసులు నడిపితే ఏడాదికి రూ.280 కోట్లు భారం పడనుందని తేల్చారు. కరోనా ప్రభావం, డీజిల్ ధరలు పెంపుతో...రోజురోజుకూ ఆర్టీసీ నష్టాల ఊబిలో కూరుకుపోతుందని అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి : కేంద్ర ఎన్నికల అధికారులతో రఘురామకృష్ణరాజు భేటీ

Last Updated : Jun 26, 2020, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.