ETV Bharat / city

'వార్డు సచివాలయాలను పట్టణ ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించండి'

author img

By

Published : Jun 7, 2020, 3:36 AM IST

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ శాతం నగరాల్లోనే నమోదు అవుతున్నాయని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. అందుకు అనుగుణంగా ఆయా నగరాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ వార్డు సచివాలయాన్ని ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

apcs reacts on corona cases in urban areas
పట్టణాల్లో కరోనా కేసుల నియంత్రణకు సీఎస్ ఆదేశాలు

రాష్ట్రంలో నమోదవుతోన్న కరోనా కేసుల్లో... 70 శాతం పట్టణాల్లోనే ఉండడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని స్పందించారు. ఆయా పట్టణ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై... కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సీఎస్ వీడియో సమావేశం నిర్వహించారు. వైరస్ వ్యాప్తి నియంత్రణకు పట్టణాల్లోని ప్రైమరీ, సెకండరీ సర్వేలెన్స్ అండ్ మానిటరింగ్ బృందాలు సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ప్రతీ వార్డు సచివాలయాన్ని ఒక పట్టణ ఆరోగ్య కేంద్రంతో అనుసంధానించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ఒకటి కంటే ఎక్కువ పట్టణ ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకుంటే... దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో ఆ వార్డు సచివాలయాన్ని అనుసంధానించాలని సీఎస్ స్పష్టం చేశారు.

'ఆరోగ్యసేతు' తప్పనిసరి

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు, దేవాలయాలు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో పనిచేసే ప్రతి ఒక్కరూ... మాస్క్ ధరించడం, ఆరోగ్య సేతు యాప్​ను వినియోగించడం తప్పనిసరి చేయాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న అర్బన్ హెల్త్ కేంద్రాలను రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని పేర్కొన్నారు. ఈ హెల్త్ కేంద్రాలు అందుబాటులోకి వచ్చే వరకు... అన్ని ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు.

'యాక్టివ్ సర్వేలెన్స్' చేపట్టండి

రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, కర్నూలు లాంటి ముఖ్య నగరాల్లోనే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇందుకోసం యాక్టివ్ సర్వేలెన్స్ చర్యలు చేపట్టడం, కాంటాక్ట్ ట్రేసింగ్, బయటి నుంచి వస్తోన్న వ్యక్తుల గురించి నిరంతరం పర్యవేక్షించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్యను తగ్గించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.

ఇదీ చూడండి: 'ఎస్​ఈసీ పునర్నియామకం'పై.. ఈ నెల 10న సుప్రీంలో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.