ETV Bharat / city

AP TOPNEWS: ప్రధాన వార్తలు@11AM - ap top ten news

.

TOPNEWS
TOPNEWS
author img

By

Published : Aug 3, 2022, 11:00 AM IST

  • రాష్ట్ర విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో.. జోనల్‌ వ్యవస్థలో మార్పులు?..
    ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన జోనల్‌ వ్యవస్థలో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. జోనల్‌ వ్యవస్థ విధివిధానాలను నిర్దేశిస్తూ 1975లో అమల్లోకి తెచ్చిన ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌లో ఏమైనా సవరణలు చేయాలా? లేకపోతే పూర్తిగా కొత్త ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ను జారీ చేయాలా? అన్న విషయంలో ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • KA PAUL: మహిళా వర్సిటీలో కేఏ పాల్‌ హంగామా.. కేసు నమోదు చేసిన పోలీసులు..
    తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో కేఏ పాల్ హల్ చల్ చేశారు. వ్యక్తిగత భద్రతా సిబ్బందితో కలిసి 5 వాహనాల్లో వర్శిటీలోకి ప్రవేశించిన ఆయన.. విద్యార్ధినులతో స్వీయ చిత్రాలు తీసుకున్నారు. కేఏ పాల్ అనుమతి లేకుండా ప్రవేశించడం, విద్యార్ధినులతో ఫోటోలు తీసుకోవడంపై ..వర్శిటీ భద్రతా సిబ్బంది అభ్యంతరం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • FRANK CABLE: విశాఖకు 12 అంతస్తుల అమెరికా నౌక.. ఔరా అనేలా..
    జలాంతర్గాములకు వెన్నుదన్నుగా నిలిచేలా సమగ్ర వసతులున్న యుద్ధనౌక ‘ఫ్రాంక్‌ కేబుల్‌’ మంగళవారం విశాఖ నౌకాశ్రయానికి చేరుకుంది. ఎల్‌.ఐ.స్పియర్‌ శ్రేణికి చెందిన దీనిని 1979లో అమెరికా నౌకాదళంలో ప్రవేశపెట్టినప్పటికీ ఎప్పటికప్పుడు ఆధునికీకరిస్తూ అత్యాధునికంగా తీర్చిదిద్దారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రికవరీ.. ఇష్టం వచ్చినట్లు కుదరదు.. ఆ సమయంలోనే సంప్రదించాలి..
    రుణం తీసుకునే వారు, చెల్లించాల్సిన బాధ్యతను మరువకూడదని.. రుణమొత్తాన్ని ఖాతాదార్ల నుంచి వసూలు చేసుకోవాల్సిన రికవరీ సిబ్బంది కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలి.. కానీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే, వారే ఇబ్బంది పడాల్సి వస్తుంద’ని ఒక జాతీయ బ్యాంకు ఉన్నతాధికారి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు.. 17 వేలకు పైగా..
    భారత్​లో కొవిడ్​ కేసులు భారీగా పెరిగాయి. తాజాగా 17,135 మంది వైరస్ బారిన పడ్డారు. 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు జపాన్​లో కొత్తగా 1.67 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దుల్కర్​ సల్మాన్​పై టాలీవుడ్ హీరో అసహనం!..
    టాలీవుడ్​కు చెందిన ఓ హీరో.. తెలుగు చిత్రసీమపై అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ నటులు లేరా.. వేరే భాషల నుంచి నటులను ఎందుకు తీసుకురావాలంటూ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Commonwealth games: లాన్‌ బౌల్స్‌ ఆట ఎలా ఆడతారో తెలుసా?..
    కామన్వెల్త్‌ క్రీడల మహిళల లాన్‌బౌల్‌ ఫోర్‌ విభాగంలో భారత్‌ మొట్టమొదటి సారి గోల్డ్​ మెడల్​ సాధించింది. ఇంతకీ ఈ ఆట ఎలా ఆడతారో తెలుసా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గుజరాత్‌ కంపెనీ వద్ద రూ.వెయ్యి కోట్ల నల్లధనం.. ఒప్పోకు రూ.4వేల కోట్ల నోటీసు..
    గుజరాత్​కు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థపై దాడులు చేసిన ఐటీ శాఖ రూ.వెయ్యి కోట్లకు పైగా నల్లధనాన్ని గుర్తించింది. జులై 20న హైదరాబాద్‌తో పాటు ఖేడా, అహ్మదాబాద్‌, ముంబయి, కోల్‌కతాలలోని కంపెనీకి చెందిన 58 ప్రాంగణాల్లో సోదాలు జరిగినట్లు సీబీడీటీ తెలిపింది. మరోవైపు, పన్ను ఎగవేత ఆరోపణలపై ఒప్పోకు రెవెన్యూ ఇంటలిజెన్స్‌ విభాగం రూ.4389 కోట్ల నోటీసు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​పైనా జవహరీ కన్ను.. ఆ వర్గాలను రెచ్చగొట్టాలని చూసి...
    అల్​ఖైదా అధినేత అల్‌ జవహరీ మృతి భారత్‌కు అత్యంత ముఖ్యమైన అంశమేనని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల భారత్​పై జవహరీ ప్రత్యేకంగా దృష్టిసారించాడని, పలు వర్గాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడని అధికారులు పేర్కొన్నారు. జవహరీ అంతం కావడం మంచిదే అయినా.. ప్రస్తుతం తాలిబన్లతో భారత్‌ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.