- సినిమా పరిశ్రమ విశాఖ రావాలి.. తెలంగాణకన్నా ఏపీ సహకారమే ఎక్కువ : జగన్
నెమ్మదిగా సినీ పరిశ్రమ విశాఖపట్నం రావాలని, అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. స్టూడియోలు పెట్టేందుకు ఆశక్తి చూపిస్తే.. విశాఖలో స్థలాలు ఇస్తామన్నారు. తెలంగాణ కన్నా ఏపీ నుంచే సినీ పరిశ్రమకు ఆదాయం ఎక్కువ వస్తోందన్నారు.
- కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ కీలక భేటీ
కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్లానింగ్, రెవెన్యూ, హోంశాఖ అధికారులతో సీఎం భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటులో వస్తున్న అభ్యంతరాలపై ఆరా తీశారు.
- TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. దర్శన టికెట్లపై తితిదే కీలక నిర్ణయం
TTD On Darshan tickets: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లపై తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో దర్శన టికెట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈవో జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి తిరుపతిలో సర్వదర్శనం టికెట్ల జారీ చేయనున్నట్లు తెలిపారు.
- హిందూపురం వైకాపా కౌన్సిలర్ మారుతీరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు
హిందూపురం వైకాపా కౌన్సిలర్ మారుతీరెడ్డి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. సామాజిక మాధ్యమాల్లో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు.
- 'అల్లర్లు వద్దనుకుంటే భాజపా అధికారంలోనే ఉండాలి'
ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అల్లర్లు, నేరస్థులు లేని రాష్ట్రం కోసం భాజపాకు ఓటేయాలని కోరారు. మరోవైపు, రాజకీయాల కోసం జనరల్ బిపిన్ రావత్ పేరును ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ధ్వజమెత్తారు.
- 'ఈడీ, సీబీఐ ఒత్తిడి నాపై పని చేయదు.. మోదీ చెప్పిందదే'
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి ప్రస్తావించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈడీ, సీబీఐ ద్వారా తనపై ఒత్తిడి తీసుకురావడం కుదరదని అన్నారు. తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.
- వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉందా? అయితే నో టెస్టింగ్, నో క్వారంటైన్!
కొవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను కేంద్రం సడలించింది. ప్రయాణికులు ఇకపై ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
- ఆర్బీఐ ప్రకటనతో జోష్- స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు
వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్బీఐ చేసిన ప్రకటనతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు వృద్ధి చెందింది. నిఫ్టీ 90 పాయింట్లు ఎగబాకింది.
- సమంత సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్.. రిలీజ్ డేట్‌తో 'పృథ్వీరాజ్'
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. ఇందులో విజయ్‌సేతుపతి, సమంత, అక్షయ్‌కుమార్, యామీ గౌతమ్, మాధురీదీక్షిత్ చిత్రాల సంగతులు ఉన్నాయి.
- రంజీ ట్రోఫీలో యష్ ధుల్.. ఏ జట్టుకు ఆడనున్నాడంటే?
అండర్-19 ప్రపంచకప్ విజయంతో జోష్ మీదున్న కెప్టెన్ యష్ ధుల్ రంజీ ట్రోఫీ ఆడేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఇంతకీ అతడు ఏ జట్టుకు ఆడబోతున్నాడంటే...
AP Top News: ప్రధాన వార్తలు @ 5 PM - ఏపీ ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు @ 5PM