జిల్లా కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికార్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని ఎస్ఈసీ లేఖలో తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించనున్నట్లు లేఖలో స్పష్టం చేశారు. పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ సమావేశంలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో పాల్గొనేందుకు సీఎస్‌ను ఇప్పటికే అనుమతి కోరినట్లు ఎస్ఈసీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని ఎస్ఈసీ లేఖపై సీఎస్ నీలం సాహ్నీ ఇప్పటికే సమాధానం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్లు, అధికారులు పాల్గొనే అంశంపై సందిగ్దత నెలకొంది.
ప్రభుత్వంతో సంప్రదించాక 'పంచాయతీ' షెడ్యూలు: రాష్ట్ర ఎన్నికల సంఘం