చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలను దిల్లీ వీధుల్లో బదనాం చేస్తున్నారని మంత్రి కన్నబాబు మండిపడ్డారు(minister kannababu fires on chandrababu). స్వప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని, ప్రజలను చంద్రబాబు కించపరుస్తున్నారని ఆక్షేపించారు. దిల్లీ వీధుల్లో చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని, ఇవి భాజపా వారికి తెలుసని వారికి కొత్త కాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడుకునేందుకు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సహా ముఖ్య నేతల అపాయింట్మెంట్ల కోసం పాట్లు పడుతూ పడిగాపులు కాస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయాలు.. మోదీ, అమిత్ షా కు తెలుసన్నారు. తెలుగుదేశం పార్టీపై తాము తప్పకుండా ఈసీని కలసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
కోర్టులో కేసు వేయండి: మంత్రి సీదిరి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం కోర్టులో కేసు వేయాలని చంద్రబాబుకు మంత్రి సీదిరి అప్పలరాజు(minister appalaraju comments on chandrababu) సలహా ఇచ్చారు. శ్రీకాకుళంలో మాట్లాడిన ఆయన.. తెదేపా బృందం ఎందుకోసం దిల్లీ పర్యటన చేస్తున్నారో ప్రజలకు వివరించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రి చుట్టూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాజీవితంలో చంద్రబాబు ఏం చేయలేరని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: Somu Veerraju: ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డికి సోము వీర్రాజు సవాల్..ఏంటంటే..!