.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ అభిప్రాయ సేకరణ - ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్టీల అభిప్రాయాలు సేకరించింది. విజయవాడలోని ఈసీ కార్యాలయంలో ఆయా పక్షాల నేతలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ భేటీ అయ్యారు. వైకాపా తరఫున శాసనసభ్యులు జోగి రమేశ్, అనిల్, తెదేపా నుంచి నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా హాజరయ్యారు. జనసేన నుంచి వెంకటమహేశ్, భాజపా నుంచి నాగభూషణం, వామపక్షాల తరఫున వై.వీ.రావు, జెల్లి విల్సన్ హాజరయ్యారు.
ec
.