ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలల జీతాల్లో 50 శాతం వాయిదా వేయడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. విశ్రాంత ఉద్యోగులకు సగం పింఛన్ చెల్లించకపోవడంపైనా ఆక్షేపించింది. జీతాలు, పింఛన్లు సగమే చెల్లించేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 26, 37లను చట్టవిరుద్ధమని పేర్కొంటూ రద్దు చేసింది.
వాయిదా వేసిన 50శాతం జీతాలు, పింఛన్లకు ఏడాదికి 12శాతం చొప్పున వడ్డీతో 2 నెలల్లోగా చెల్లించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆర్థికవ్యవస్థపై లాక్‌డౌన్ చూపిన ప్రభావం కారణంగా అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో గరిష్ఠంగా 60శాతం, కనిష్ఠంగా 10శాతం చెల్లింపులను వాయిదా వేస్తూ ప్రభుత్వం గతంలో జీవోలు జారీ చేసింది. ఇది చట్టవిరుద్ధమంటూ విశ్రాంత జిల్లా జడ్జి లక్ష్మీ కామేశ్వరి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. 2 నెలల్లో వడ్డీతో సహా జీతాలు చెల్లించాలని ఆదేశించింది.
ఇదీ చూడండి..