ETV Bharat / city

ఈనెల 14 వరకూ ఎక్కడివక్కడే.. రాజధాని తరలింపుపై హైకోర్టు స్టేటస్​కో - పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్‌ కో వార్తలు

ap-high-court-status-co-on-crda-cancelled-bill-and-3-capitals
పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టు స్టేటస్‌ కో
author img

By

Published : Aug 4, 2020, 4:09 PM IST

Updated : Aug 5, 2020, 3:51 AM IST

16:07 August 04

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పందించింది. ఆ బిల్లులపై హైకోర్టు స్టేటస్‌ కో విధించింది. దీనిపై కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది 10 రోజులు సమయం కోరారు. అప్పటివరకు యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 14కు వాయిదా వేసింది.

డీఎస్​ఎన్వీ ప్రసాద్​బాబు

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్​లో కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర సీఎస్​, సీఆర్డీఏ అధికారులకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ రాకేశ్​ కుమార్​, జస్టిస్​ ఏవీ శేషసాయి, జస్టిస్​ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. 

రాజధాని తరలింపునకు సంబంధించిన వ్యాజ్యాలను ప్రస్తుత వ్యాజ్యానికి జత చేయాలని న్యాయస్థానం రిజిస్ట్రీని ఆదేశించింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో గెజిట్​లను సవాల్ చేస్తూ హైకోర్టులో రాజధాని రైతులు రామారావుతో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. అమరావతి నుంచి రాజధానిని మార్చి.. మూడు రాజధానులు ఏర్పాటుకు చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. రాజ్​భవన్​, సీఎం కార్యాలయం, సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, పోలీసు శాఖ కార్యాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలన్నారు. సీఆర్డీఏ బృహత్తర ప్రణాళికను అమలు చేసేలా ఆదేశించాలని కోరారు.

మరోవైపు సీఆర్​డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టం, రాజధానిపై విశ్రాంత ఐఏఎస్​ జీఎన్​రావు నిపుణుల కమిటీ, బోస్టన్​ కమిటీ, ఉన్నత స్థాయి కమిటీ నివేదికలను సవాల్​ చేస్తూ టి.శ్రీనివాసరావు, డి.సాంబశివరావు హైకోర్టులో మూడు వ్యాజ్యాలు వేశారు.

భూములు త్యాగం చేశారు..

రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సుప్రీంకోర్టు సీనియర్​ న్యాయవాది శ్యాం దివాన్​ వాదనలు వినిపించారు. రాజధాని నగర నిర్మాణానికి రైతులు వేల ఎకరాల భూములు ఇచ్చారన్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలిస్తే వారి జీవనాధారం పోతుందన్నారు. ప్రజల జీవనాధారం లేకుండా చేసే చట్టాలు ఏవైనా చెల్లుబాటు కావంటూ వాటిని రద్దు చేయాలన్నారు. భూములపై మమకారం పక్కన పెట్టి రైతులు రాజధాని కోసం త్యాగం చేశారన్నారు. రాజధాని విషయంలో ఈ ఏడాది జనవరి 20 వరకు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని ఉన్నత స్థాయి కమిటీని హైకోర్టు ఆదేశించినా.. జనవరి 17నే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం స్టేటస్​ కో ఆదేశాలు ఇవ్వకపోతే పది రోజుల్లో కార్యాలయాలు తరలించేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.

పది రోజులు ఆగితే ఏమవుతుంది

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్​ న్యాయవాది రాకేశ్​ ద్వివేది జోక్యం చేసుకుంటూ.. పిటిషన్​లో లేవనెత్తిన అంశాలకు కౌంటర్​ దాఖలు చేయడానికి పది రోజులు గడువు కావాలని కోరారు. గడువు తీసుకుంటే అభ్యంతరం లేదు కానీ.. ఈలోపు కార్యాలయాలు తరలించబోమని హామీ తీసుకోవాలని శ్యాం దివాన్​ కోరారు. అయితే దీనికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని.. తాము హామీ ఇవ్వలేమని ద్వివేదీ చెప్పారు. రాజధానిని మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఆ సమయంలో.. కౌంటర్​ వేసే వరకూ వేచి ఉంటే ఏమవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

పది రోజుల్లో కార్యాలయాలు తరలిస్తే పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాజ్యాల్లో పిటిషనర్లు గెలిస్తే తరలిపోయిన కార్యాలయాలను వెనక్కి తీసుకురావాలంటూ తాము ఆదేశించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ తరహా ఉత్తర్వులిచ్చినా తప్పు లేదు కానీ.. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని రాకేశ్​ ద్వివేదీ అన్నారు. యథాతథ స్థితి ఉత్తర్వులు ఇవ్వడమంటే ఓ విధంగా స్టే ఇచ్చినట్లు అవుతుందన్నారు. సీఆర్​డీఏ తరఫున సీనియర్​ న్యాయవాది ఎస్​.నిరంజన్​రెడ్డి స్పందిస్తూ.. అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగుతాయన్నారు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. 

ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. ఈనెల 14 వరకూ రాజధానిలో ప్రస్తుతం ఉన్న స్థితినే పాటించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. స్టేటస్​కో ఉత్తర్వులిచ్చింది.

మరిన్ని వ్యాజ్యాలు

పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్​డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ.. మంగళవారం హైకోర్టులో మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఆడిటర్​ లంకా దినకర్​, గుంటూరు మిర్చియార్డ్​ మాజీ ఛైర్మన్​ మన్నవ సుబ్బారావు వీటిని దాఖలు చేశారు.

ఇదీ చదవండి...

ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అన్నిపోలీసు స్టేషన్లలో ఫిర్యాదు

Last Updated : Aug 5, 2020, 3:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.