ETV Bharat / city

'జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ-వాచ్ తీసుకొస్తే కోర్టును ఆశ్రయించండి' - ఈ వాచ్ యాప్​పై ఏపీ హైకోర్టు వ్యాఖ్యలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్​ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి.. ఈ-వాచ్ యాప్​ను తీసుకొచ్చినట్లయితే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన 'ఈ- వాచ్' యాప్​పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన మూడు వ్యాజ్యాల్ని హైకోర్టు పరిష్కరించింది.

ap high court orders on E-watch app
ap high court orders on E-watch app
author img

By

Published : Mar 9, 2021, 1:24 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చిన 'ఈ- వాచ్' యాప్​పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన మూడు వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. పురపాలక ఎన్నికలు ఈ నెల 10తో ముగియనున్నాయని.. యాప్​పై ఏపీ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఎస్ఈసీ ఇంకా వివరాలు సమర్పించలేదని ప్రభుత్వ న్యాయవాది సుమన్ కోర్టుకు తెలిపారు. ఆ వివరాల్ని నమోదు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం, వ్యాజ్యాలను పరిష్కరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎస్​ఈసీ నోటిఫికేషన్ ఇచ్చి.. యాప్​ను తీసుకొచ్చినట్లయితే మళ్లీ కోర్టును ఆశ్రయించడానికి పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది.

ఇదీ చదవండి: ప్రలోభాల పర్వం.. డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.