పది, ఇంటర్ పరీక్షల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా సోకిన విద్యార్థులకు పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 30 లక్షలమంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములవుతారన్న న్యాయస్థానం.. విద్యార్థుల మానసిక పరిస్థితిని ఎలా అంచనా వేయగలరని ప్రశ్నించింది. పరీక్షల అంశంపై పునరాలోచించాలని సూచించింది. విచారణ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో పరీక్షల రద్దుతో పాటు సీబీఎస్ఈ, ఐఎస్సీఈ బోర్డుల నిర్ణయాన్ని గుర్తు చేసింది. కరోనా సోకిన విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలు నిర్వహిస్తామని.. ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు న్యాయస్థానం.. తదుపరి విచారణ మే 3కు వాయిదా వేసింది. కరోనా వేళ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి : పది,ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో ప్రజాహిత వాజ్యాలు