ETV Bharat / city

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు - ఫోను ట్యాపింగ్ పిటిషన్ పై హైకోర్టు విచారణ

న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ పిటిషన్​పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఇచ్చిన నోటీసుల లిఖిత పూర్వక ఉత్తర్వులు వెలువెడ్డాయి. విశాఖకు చెందిన న్యాయవాది నిమ్మి గ్రేస్ వేసిన పిటిషన్​పై కోర్టు ఈ నెల 18న విచారణ జరిపింది. కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సహా పలు సంస్థలను ఆదేశించింది.

హైకోర్టు
హైకోర్టు
author img

By

Published : Aug 21, 2020, 2:59 PM IST

Updated : Aug 21, 2020, 3:25 PM IST

న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని వేసిన పిటిషన్​పై హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ ఇచ్చిన లిఖిత పూర్వక ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ నెల 18వ తేదీన జరిగిన విచారణ తర్వాత కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్, ట్రాయ్​తో పాటు పలువురు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. వీరిని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ పై విశాఖ న్యాయవాది నిమ్మి గ్రేస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఇదీ చదవండి : పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదు: పవన్ కల్యాణ్

Last Updated : Aug 21, 2020, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.