విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు దుర్ఘటనకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా... కంపెనీ డైరెక్టర్లు విదేశాలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీ డైరెక్టర్ల పాస్‌పోర్టులు ఇప్పటికే సరెండర్ చేశామని ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అన్ని ట్యాంకుల్లో ఉన్న స్టైరీన్‌ను దక్షిణకొరియాకు తరలించినట్లు వివరించారు.
ఎన్జీటీ ఆదేశాల మేరకు జిల్లా కోర్టులో 50 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. ఇరువైపు వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: