.
సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: హైకోర్టు న్యాయవాది శ్రావణ్‌కుమార్ - ఏపీ ఎస్ఈసీ తాజా వార్తలు
పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం అని హైకోర్టు న్యాయవాది శ్రావణ్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనల్లో పస లేనందునే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందని అన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు ఎస్‌ఈసీ ఎంత దూరమైనా వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సుప్రీం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా పాటించాలన్నారు. ఉద్యోగ సంఘాలు ఎన్నికల సంఘానికి సహకరించాలని కోరారు.
ap local polls 2021
.