AP Govt Talks with Employee Union Leaders: ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ చర్చలు ముగిశాయి. హామీ ఇస్తే ఉద్యమ కార్యాచరణను తాత్కాలికంగా వాయిదా వేస్తామని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. అయితే.. ఉద్యోగుల డిమాండ్లపై రాతపూర్వక హామీ ఇవ్వాలని స్పష్టం చేశాయి.
అయితే.. ఉద్యోగుల డిమాండ్లపై బుధవారం చర్చలు జరుపుతామని మంత్రి బుగ్గన వెల్లడించారు. అన్ని విభాగాల కార్యదర్శులతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. మరోవైపు మిగతా ఉద్యోగ సంఘాలతోనూ ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి.
'ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. ఏపీ సచివాలయానికి సంబంధించి 11 అంశాలు.. ఉద్యోగులకు సంబంధించి 85 అంశాలు నివేదించాం. సచివాలయంలో అదనపు పోస్టులను భర్తీ చేయాలని కోరాం. కోర్టు కేసులు పెరుగుతున్నందున పని భారం పెరిగింది. అసెంబ్లీ ఉద్యోగులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు కోరాం. జిల్లాల్లో ఉద్యోగులకు స్థానికంగా ఇళ్ల స్థలాలు కోరాం. వీఆర్వోలకు పదోన్నతులు ఇచ్చినా గ్రేడ్ 2 స్కేల్ ఇస్తున్నారు' - వెంకట్రామిరెడ్డి
ఉద్యమం విరమించాలని కోరుతున్నాం - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మంత్రి
'ఉద్యోగ సంఘాల నేతలతో పెండింగ్ అంశాలపై చర్చించాం. రెండు జేఏసీలు ఇచ్చిన విజ్ఞప్తులు తీసుకున్నాం. కొవిడ్ సహా వివిధ కారణాల వల్ల పరిష్కారం ఆలస్యం. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు త్వరలో పరిష్కారం అవుతాయి. దశలవారీగా డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వ యోచనలో ఉంది. బుధవారం సీఎస్ కమిటీ ఉద్యోగుల డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటాం. ఉద్యోగుల డిమాండ్లపై 9 సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఉద్యమం విరమించాలని ప్రభుత్వం తరఫున కోరుతున్నాం. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాం' - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక మంత్రి
ఇదీ చదవండి:
Amaravati Farmers Meeting: అమరావతి రైతు సభకు రాజకీయ నేతలు.. హాజరయ్యేది వీరే..!