నూతన ఇసుక పాలసీని సమర్థవంతంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో ఇసుక పర్యవేక్షణకు మైనింగ్ అధికారులను నియమించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతలు పొరుగు సేవల ఉద్యోగులు చూసేవారు. ఇసుక పాలసీలో పారదర్శకత కోసమే కొత్త నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
ఏడీ, డీడీ స్థాయి అధికారులకు బాధ్యతల వల్ల జవాబుదారీతనం పెరుగుతుందనని ఉన్నతాధికారులు అభిప్రాయపడ్డారు. ఏపీఎండీసీ, మైనింగ్ శాఖ మధ్య సమన్వయంతో ఇసుక విక్రయాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రణాళికను రూపొందించారు.
ఇదీ చదవండి: